గురువు బిడ్డలు ;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 కులమతాల చిందులు వేయక
లాభాలాభాల స్ప్రుహయే లేక రాగద్వేషాలకు అందకుండా 
సమభావంతో, నిశ్చల మనసుతో
ఆప్త కాముడై, ఆత్మ బంధువై
తల్లిదండ్రులను మరిపించే ధేనువు 
తాను శ్రమిస్తూ జ్ఞానఫలాన్ని అందించి 
జాలిగాలినిచ్చే తరువే గురువు 
శిష్య తరువుల్ని అందనంత ఎత్తుకు పెంచే ఎరువే గురువు 
గురువును తలచినంతనే
గుండెలోని తాపాలు తొలగి
దీపాలు వెలుగుతాయి
గురు సన్నిధి ఆనందాంబోధి
గురు విరోధి కళ్ళున్న కబోధి
మనందరం గురువు బిడ్డలమే
మనందరికీ ఒకే పండుగ
అదే గురుపూర్ణిమ పండుగ!!
—-----------------------------------------


కామెంట్‌లు