బావోబాబ్ చెట్లు...;- - యామిజాల
  ఆఫ్రికా ఖండంలోను, ఆస్ట్రేలియా లోనూ చూడవచ్చు. ముఖ్యంగా మడగాస్కర్ లో ఐతే అనేకముంటాయి. 
ఈ చెట్ల విలక్షణత కొమ్మలు. ఇవి నీటిని నిల్వ చేస్తాయి. శుష్క పరిస్థితులలో ఇవి జీవించడానికి వీలు కల్పిస్తాయి.  
ఈ చెట్లు వేల సంవత్సరాల పాటు జీవించగలవు. 30 మీటర్ల ఎత్తుకు ఎదుగుతాయి. ఈ చెట్టు చుట్టుకొలత 50 మీటర్ల  వరకు ఉంటాయి. 
బావోబాబ్ చెట్లు విటమిన్ సి అధికంగా ఉండే పొట్లకాయ లాంటి పెద్ద పండ్లనిస్తాయి.
తాడు, గుడ్డ తయారీకి ఉపయోగించే బెరడును కలిగి ఉంటాయి ఈ చెట్లు. 
అంతేకాదు, ఇవి వివిధ జాతులకు ఆహారం, నీరు, ఆశ్రయాన్ని అందించడంలోను,  పర్యావరణ పరిరక్షణ పాత్రను పోషిస్తాయి 

కామెంట్‌లు