వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచన పల్లి.
 ప్రకృతి మనకు ఇచ్చిన సమయం  ఉదయం నుంచి తిరిగి ఉదయం వరకు 24 గంటలు  విద్యార్థిగా బడికి వెళ్లి రావడానికి ఎనిమిది గంటలు  నీ వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికి ఎనిమిది గంటలు  మీ ఆరోగ్యం సక్రమంగా ఉండడం కోసం చక్కటి నిద్ర పోవడానికి ఎనిమిది గంటలు  దానిని గురుకులంలో ఏర్పాటు చేస్తున్నారు  గురుకులంలో తప్పకుండా మీరు పాటించే ఈ నియమాన్ని  ఇంటిదగ్గర ఎందుకు సమయపాలన చేయలేకపోతున్నారు అన్నది మిమ్మల్ని మీరు ఒక్కసారి ఆలోచించుకున్నట్లయితే  సహజంగా శరీరంలో ఉన్న బద్ధకం ఎప్పటికప్పుడు తరువాత చేద్దాములే అన్న  భావన  మీ అంతట  మీరే 24 గంటలు ఎలా  ఉపయోగించుకుంటాము  ప్రణాళిక బద్ధంగా  ఏర్పాటు చేసుకోండి  మీరు అనుకున్నట్టుగా ఆ క్షణానికి ఆ పని  జరిగితీరుతుంది  వారం పది రోజులు  కృషి చేయండి  ఆ తర్వాత జీవితంలో అదే  అలవాటవుతుంది.ఏ ఇంట్లో నైనా  ఏ పదార్థాలు చేసినా దానికి అల్లం లేకుండా ఉండదు  గృహిణిని అడిగితే ఎందుకు అల్లం వేస్తున్నారు అంటే రుచికోసం అని చెప్తుంది తప్ప దానిలో ఉన్న  ఆరోగ్య పరిరక్షణ గురించి చెప్పలేదు  ముందు అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి అన్న విషయం ఎంతమందికి తెలుసు  ఆ అల్లం బాగా ఎండి పోతే అది సొంటి  ఆ సొంటిని మనం భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దలో కలిపి నేతితో  నేతితో తింటే అంతవరకు ఉన్న అజీర్ణ  స్థితి వెంటనే తగ్గుతుంది  బాలింతల కు శరీరం తగ్గి వేడి కలిగించేందుకు సొంటిని విస్తృతంగా వాడతారు  ఎక్కువగా ఆయుర్వేద మందులలో ఆయుర్వేద వైద్యుడు వాడేది సొంటిని  ఏదైనా పదార్థం తీసుకుంటున్నప్పుడు దాని ప్రయోజనాలు కూడా తెలుసుకుంటే ఆనందంగా  ఉంటుంది.ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు ఆశలతోనే జీవిస్తాడు పున్నామ నరకం నుంచి కాపాడే వాడుగా కొడుకు కావాలి అని కోరుకుంటూ  జీవితంలో సగభాగమైన భార్య శాస్త్రీయoగా తనకు సొంతం కావాలనుకుంటాడు స్నేహితుడు బంధువులు మిత్రులు అందరూ నాకు ఎంతో తోడ్పాటును అందిస్తారు అనుకుంటాడు  కానీ నీ మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసా  భార్య ఇంటి గుమ్మం దాటే వరకు మాత్రమే వస్తుంది  నీ వనకున్న నీ బంధు మిత్రులు సహితమంతా  స్మశానం వరకు తోడు వస్తాడు  ఒక్క కొడుకు మాత్రం తలకోరివి వరకు ఉంటాడు   స్మశానంలో  కానీ  నీ జీవితంలో భౌతికంగా మరణించిన నీతో పాటు వచ్చేవి నీవు చేసిన మంచి చెడు కార్యాలు మంచి చేసి ఉంటే స్వర్గానికి చెడు చేసిఉంటే నరకానికి అన్న నమ్మకం  మన అందరికీ ఉంది  ఇది తృణప్రాయమైన జీవితం.
============================
సమన్వయం ; డా. నీలం స్వాతి 

కామెంట్‌లు