నేను కూడా
ప్రపంచ సంపూర్ణ సాక్షరతా
మహాయజ్ఞపు సమిధనౌతాను
నేనుకూడా
మానవాళికి వెలుగునిచ్చే
అక్షర కిరణాన్నౌతాను
నేను కూడా
యథాశక్తి అక్షర చిరుదివ్వెను
వెలిగిస్తాను!!
క్షరము కానిదే అక్షరము
అక్షరమైన అక్షరకిరణాస్త్రంతో
క్షరమయ్యే నిరక్షరాస్యతా రక్కసిని
నేను కూడా దునుమాడుతాను!!
**************************************
అక్షరము;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి