తెలుగు వెలుగు!;- డా.పివిఎల్ సుబ్బారావు,-విజయనగరం,-94410 58797.
 గిడుగురామమూర్తిజయంతి, తెనుగుభాషాదినోత్సవం,  శుభాకాంక్షలతో
----------------------------------------------------------------------------------------   .
1.
  గతమెంతో ఘనం!
  వర్తమానం అస్తవ్యస్తం!
 భవిష్యత్తు ప్రమాద సంకేతం!
2.
అమ్మపాలతో
కలుగు పేగు బంధం! 
అమ్మభాషతో ముందుకు,
 సాగు విద్య నిరంతరం!
నేడు అమ్మలు ,
     పాలివ్వడం అరుదు!
 పిల్లలు అమ్మ భాష ,
        నేర్వడం కుదరదు !
మాట్లాడే వారి సంఖ్యతోనే, 
భాష అమృతమో/ మృతమో!
3.
 ఆంగ్లేయులు,   
      స్వాతంత్ర్యమిచ్చారు! 
తమ ఆంగ్ల భాష ,
      కాపలా పెట్టి వెళ్లారు! 
ఆంగ్లభాష ఆకర్షణ ,
           భూమి ఆకర్షణ! 
ఆంగ్ల మాధ్యమం రాజై,
                 ఠీవిగా నిలిచింది 
తెలుగు మాధ్యమం,   
        వెనుకడుగు వేస్తోంది! 
 
4.
ప్రాథమిక విద్య మాతృభాషే!
కొఠారి కమిషన్ స్పష్ట ఆదేశం!
మాధ్యమఎంపిక ఉన్నతవిద్యే!
నేడు అక్షరాభ్యాసమే ఆంగ్లం! 
తెలుగు వెలుగు,
 సన్నగిల్లక ఏమవుతుంది?
5.
ఉత్సవాలు ఉత్సాహమే కానీ ,
అంతటితో సరిపోతుందా?
తెలుగు భాష పై మనమంతా, 
        ఉత్సుకత పెంచాలి!
తల్లితండ్రులు భాషా, వారసత్వం కొనసాగించాలి! 
ఇంట్లో తెలుగులోనే, ,
             మాట్లాడుకోవాలి!
తెలుగు వెలుగు రాష్ట్రమంతా, ప్రతిఇంటా వేయిదీపాలై, వెలగాలి!
6.
వినడం, అనడం,
        చదవడం, వ్రాయడం! 
భాషా నైపుణ్యాలు అవే ,
          జీవన నైపుణ్యాలు! 
స్పష్టమైన తెలుగు విందాం,
     తీయనైన తెలుగు అందాం!
నిత్యం తెలుగు చదువుదాం, 
        తెలుగు వ్రాస్తూ ఉందాం!
ఆనాడే తెలుగు వెలుగు వైభవ,
           నిజ  పునరుజ్జీవనం!
గిడుగు మహోద్యమం, మనమంతా కొనసాగించడం!
_________


కామెంట్‌లు