నాయక కేసరి! ఆంధ్ర కేసరి!;- డా. పివిఎల్ సుబ్బారావు. విజయనగరం. 9441058797.
 ఇంటి పేరు టంగుటూరి, పోరాటం ఆయన ఊపిరి! 
భారత స్వాతంత్ర్య పోరాటాల, దివ్య ప్రభావం నవ్య ప్రకాశం! 
సర్వస్వం త్యజించిన, భరతమాత ముద్దుబిడ్డడు! 
స్వాతంత్ర సమరయోధుడు, 
మన మొదటి ముఖ్యమంత్రి, అతడు! 
ఆ పేరు తలచిన చాలు ధన్యం, అవుతాయి మన జీవితాలు! 
2.
తల్లి భోజనశాల నడిపి, కుటుంబాన్ని నడిపించింది! 
ఆయన ఇళ్లల్లో వారాలు చేసి, దారిద్ర్యాన్ని ఎదిరించాడు! 
నాటకాల్లో నటించాడు,
 ఆటల్లోచురుకు అనిపించాడు! 
మెట్రిక్, ఎఫ్.ఏ,న్యాయశాస్త్రం, చక్కగా అభ్యసించాడు! 
 న్యాయవాద వృత్తి చేపట్టాడు, అగ్రగామిగా నిలిచాడు! 
3.
ముప్పదిఐదవఏట రాజమండ్రి, పురపాలక అధ్యక్షుడు 
ఇంగ్లాండ్ పయనం ,
బారిష్టరై స్వదేశ ఆగమనం! 
వెళ్లే ముందు గాంధీ గారిలా, తల్లి ముందు ప్రతిన చేశాడు! 
బారిష్టరుగా ప్రతి కేసు గెలిచి ,
వెలుగు వెలిగాడు! 
బిపిన్ చంద్రపాల్ ప్రభావం సత్యాగ్రహ పత్రాన సంతకం! 
4.
స్వాతంత్ర ఉద్యమాన,
ముందడుగు ,వృత్తికి ఇక, వెనుకడుగు! 
అప్పటికి ఆదాయం లక్షల్లో,
 అది వినియోగం దేశ సేవలో! 
సైమన్ కమిషన్ వ్యతిరేకత, వినిపించే ఓ సింహ గర్జన! 
కాల్చండి రా అరిచాడు,
 గుండుకు గుండె ఎదురు,   
  అన్నాడు! 
ఆంధ్ర కేసరిగా కీర్తి,
 తరతరాలకు ఆయన స్ఫూర్తి! 
5.
ప్రకాశం బ్యారేజ్/ జిల్లా, తపాలాబిళ్ళ వారి స్మృతులు! 
ఆత్మకథ- నా జీవిత యాత్ర, స్వాతంత్రోద్యమ సచ్ఛరిత్ర! 
"గాలిలోనైనా పోట్లాడే, స్వభావం, ప్రకాశం" ,
  అయ్య దేవర! 
ప్రమాదం ఉన్నచోట ప్రకాశం, ఉంటాడు భోగరాజు! 
నిజాయితీకి నిలువెత్తు, సంతకం ప్రకాశం ,
జాతి నమ్మకం!
_________

కామెంట్‌లు