మనిషి ఒక జీవితకాలంలో సాటించలేని ఘనకార్యాలను ఎన్నిటినో చేసి చూపారు ఆయన తన ఏడవ ఏట నుంచి 85 ఏటి వరకు అంటే సుమారు 8 దశాబ్దాల పాటు నిర్విరామంగా నాదోపాసన చేసి సంగీత సామ్రాజ్యానికి మకుటధారి మహారాజు లా గడిపి వెళ్లిన పద్మవిభూషణన మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు తన జీవితంలో చివరి ఆరు నెలల కాలం అనారోగ్య కారణంగా కచేరీలకు దూరంగా ఉన్నారు 22 11 2016న భగవత్సాన్నిద్యాన్ని చేరుకున్నారు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మహనీయుని పేరు కలకాలం నిలిచి ఉండే సంగీత విశ్వవిద్యాలయాలను స్థాపించాలని ఏటా వారిని సంస్మరిస్తూ సంగీత కార్యక్రమాలు నిర్వహించాలని అభివృద్ధిలోకి వచ్చే అనేకమంది యువ సంగీత విద్వాంసులను ప్రోత్సహించవలసిందిగా ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని కోరవలసిన బాధ్యత ఉన్నది.ఉన్నది ఒకటే సత్తా అది వీరి దృష్టిలో సప్త స్వరాలు ఆ ఏడు అక్షరాలతో శిష్యులకు ఎన్ని రకాలుగా ఎన్ని గమకాలు సృష్టించవచ్చు అవన్నీ నేర్పడంలో జాగ్రత్త వహించి ఉండాలి ఆ గురుత్వం రామస్వామి గారికి వెన్నతో పెట్టిన విద్య ఎంత మందమతిగా ఉన్న శిష్యుడు అయినా తన దగ్గరికి తీసుకొని వస్తే ఆ మందాన్ని తగ్గించి మతిని పెంచే ఆయుధం వీరి దగ్గర ఉంది దానిని నేటికీ ప్రయోగిస్తున్నారు వీరి అన్నగారు గోపాలం గారు కూడా ఆకాశవాణి కళాకారులు నిలయ కళాకారుడైన గోపాలo గారు ప్రక్క వాద్యం లోనూ కంజీర లోను ప్రసిద్ధుడు గోపాలం గారి అబ్బాయి కి కూడా ఆ విద్య అలవడింది అన్నవరపు వారు చేతల మనిషి తప్ప మాటల మనిషి కాదు జీవితంలో తాను వాడిన మాట ఎప్పుడూ తప్పలేదు వారి శిష్యులకు మిత్రులకు వారెప్పుడు ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు.ప్రపంచ ప్రఖ్యాత హిందూస్థానీ సంగీత విద్వాంసులు బలే గులాం అలీఖాన్ గారు వేదిక మీద అనేక పర్యాయాలు చెప్పారట తాను ఒకరోజు సాధన చేయకపోతే ఆ లోపం తనకు తెలుస్తుందని రెండో రోజు చేయకపోతే అది నా ప్రక్కన ఉన్న వాద్య బృందానికి తెలుస్తుందని అదే మూడో రోజు కూడా చేయకుండా బద్దకించినట్లయితే ప్రేక్షకులు కూడా దానిని పసిగడతారని చెప్పేవారట దానిని శిష్యులు అనుసరిస్తూనే ఉన్నాడు కనుక కమాను తన చెప్పు చేతుల్లో ఉంది అని చెప్పుకుంటారు రామస్వామి గారిలో ఎప్పటికీ చెప్పుకోదగిన ఉత్తమ గుణం తమ శిష్యులకు పాఠాన్ని చెప్తున్నప్పుడు కొంతమంది చెప్పిన మరో క్షణంలోనే అర్థం చేసుకుంటారు మరి కొంతమంది అర్థం చేసుకోలేరు.
=====================================
సమన్వయం ; డా. నీలం స్వాతి
=====================================
సమన్వయం ; డా. నీలం స్వాతి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి