గ్లోబల్ సంస్కృతిమాయా వలలో నేటియువత ;- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగాం-9640748497
వివాహ వ్యవస్థనే 
అపహాస్యంచేసే
అథములు

చాటింగ్ డేటింగ్
అగ్రిమెంట్ మ్యారేజ్ కి
సై సై అనే సంకరసంస్కృతికి
ద్వారాలు తెరిచిన
నీచ నికృష్టపు నాయాళ్ళు

జంతు ప్రవృత్తికి మరిగి
నైతిక విలువలు మరచి
వావీవరసలు గాలికొదిలేసిన
చిత్తకార్తె కుక్కలు

గ్లోబల్ సంస్కృతి
మాయా వలలో చిక్కుకున్న
అమాయక జీవులు
ఓయో పబ్ కల్చర్ తో 
కట్టడిలేని విశృంఖల
స్వేచ్ఛాజీవనం
మద్యం డ్రగ్స్ కు
బానిసలై
అర్థాంతరంగా తనువును
చాలిస్తున్నరేపటియువతరం

ఏ తీరాలకో
మన గమ్యం
ఈ విషసంస్కృతి
జీజాలు మన దేశాననాటిన
ఆ ఆమోసగాడెవడు
చెడునే అమృతప్రాయమని
విభిన్న సైట్లలో
యువతే టార్గెట్ గా
ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్న
ఆ అగంతకుడెవడు 
మన దేశాన్ని బలహీనపరచే
కుట్రదారుడేవడు
తస్మాత్ జాగ్రత్త
తస్మాత్ జాగ్రత్త 
నేటి యువతే రేపటి దేశ భవిత




కామెంట్‌లు