జ్ఞాన గుళికలు;- అంకాల సోమయ్య- దేవరుప్పుల-జనగామ -9640748497
అన్నీ ఉన్నాయి కానీ
చదివే ఓపిక లేదు
బద్ధకంతో స్నేహం
బ్రతుకు దుర్భరం

ఓట్లప్పుడు ఏమేమో హామీ ఇచ్చాడు నేత!?
ఇప్పుడు అతని నిలదీసి అడగాలి
మన ఐక్యతను చాటాలి

ఆరంభ శూరత్వంతో
గెలవాలని వెళ్లాను
నిరాశ మనసున మెదిలి
ఓటమిని వెంట తీసుకొచ్చాను

మానవ సంబంధాలన్నీ
ఆర్థిక సంబంధాలైతే
మనీషితనమేది
మానవత్వమేది

దీపాన్ని ముద్దాడితే
మూతి చురుక్కుమందా!?
ముద్దు స్థానభ్రంశము  
మూతికే ముప్పు తెచ్చిందా!?

గోడలకు చెవులు ఉన్నాయి కళ్ళు ఉన్నాయి
చూపు నైనా మాటనైనా
అంతా బహిరంగ రహస్యం అని
ఏ కరువు పెట్టకు

స్వదేశీ సంస్థల్ని
బహుళ జాతి సంస్థలు మింగాయి
పరాయికరణకి శ్రీకారం అనుకోవచ్చు గా!?

ఆనంద సమయంలో
ఆత్మీయులు ఎందరో
విషాద మలుముకున్న సమయాన
మనలనువిడువక అండగుండేదెందరు ఆత్మవిశ్వాసం పెంచేదెందరు?

విధి లేక తప్పులో కాలేశాను
బ్రతుకును పాడు చేసుకుని
చెరసాల నా ఏడ్చాను

మనల్ని  కన్న తల్లిదండ్రులు వారు సామాజిక పరివర్తకులు అందుకే మన శక్తి యుక్తులు సమాజానికి రాసి ఇచ్చిన వీలునామాలు అవ్వాలి
 


కామెంట్‌లు