అమ్మ భాషేడుందిరా--?!;- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
అమ్మ భాషేడుందిరా--
అమ్మ మమ్మీ
అయిపోయెరా ---2
అమ్మ భాషేడుందిరా
అమ్మ డమ్మీఅయిపాయెరా---2

తల్లి స్తన్యం తోడ
నేర్చుకున్న భాష
ఉపాధి మోజున
ఉత్తదే అయిపాయే2

భాషాభిమానం మేది
నీభాష ఆటలోఅరటిపండు2
అచ్చ తెలుగునుమరిచి
సకల భాషలుగా నేర్చి
సకిలించు చున్నారు2

బడిలోన బాధ్యతగ
మన భాషనేర్వాలి2
ఉద్యోగ ఉపాధి
మనభాషచూపాలి2




కామెంట్‌లు