బుద్ధుని మహా పరి నిర్వాణం ;- కుసుమాంజలి,విజయవాడ,9676689801

 బుద్ధుడు వైశాలి లోని ఆమ్రపాలి మామిడి తోటలో ఉన్న సంగతి నిచ్చపులకు తెలిసింది వారు నీలం పసుపు ఎరుపు రంగులతో అలంకరించిన అనేక రథాలలో వైశాలి కి చేరుకున్నారు దారిలో వారికి ఆమ్రపాలు ఎదురయింది అప్పుడు వాళ్ళు ఆమ్రపాలి నీవు మాతో సమానంగా రథం మీద ప్రయాణిస్తూ ఎందుకు ఎదురు పడుతున్నావు అన్నారు అయ్యా నేను బుద్ధ భగవానుడిని రేపు భోజనానికి ఆహ్వానించడానికి వెళ్లి వస్తూ ఎదురుపడ్డాను అని చెప్పింది ఆమ్రపాలి రేపు సభాగతులకు బిక్ష సంఘానికి భోజనం పెట్టే అవకాశాన్ని మాకు ఇవ్వు అని అడిగారు ఈ వైశాలి నగరాన్ని నగరంలోని భూములు అన్నిటిని నాకు ఇచ్చిన నాకు దొరికిన ఈ అవకాశాన్ని జార విడుచుకోలేను అని   బదులిచ్చింది ఆమ్రపాలి.నిచ్చవులు చిటికెలు వేసుకుంటూ దెబ్బతీసింది ఆమ్రపాలి మనల్ని బాగా దెబ్బతీసింది అంటూ బుద్ధుడిని బిక్ష సంఘాన్ని ఆహ్వానించే ప్రయత్నాన్ని విరమించకుండా ముందుకు సాగిపోయారు  అలా నిచ్చవులు రథాలలో ముందుకు సాగి బుద్ధుని  వద్దకు వచ్చి సాగి కూర్చున్నారు అప్పుడు బుద్ధుడు వారిని ధమ్మo పట్ల  ఆసక్తులను చేసి ధమ్మ బోధ గావించాడు శ్రద్ధగా విన్న నిచ్చవులు భగవాన్ తధాగతులు భిక్షసంఘం రేపు మా ఆతిథ్యం స్వీకరించడానికి అంగీకరించండి అని కోరారు నిచ్చవులారా వైశాలి నగర శోభిని ఆమ్రపాలి ఆహ్వానం మేరకు ఆమె వెంట దీక్ష స్వీకరించడానికి ఈపాటికి అంగీకరించాము అని తెలియజేశాడు బుద్ధుడు అప్పుడు మమ్మల్ని దెబ్బతీసింది ఆమ్రపాలి మమ్మల్ని దెబ్బ కొట్టింది అన్నాడు బుద్ధుని ధమ్మ ప్రవచనానికి ఆనందించి లేచి తిరిగి ప్రయాణమయ్యారు.తెల్లవారిన దగ్గర నుంచి రుచికరమైన కాధ్య భోజన పదార్థాలను ఎన్నింటినో తన మామిడి తోటలోనే సిద్ధం చేసి మధ్యాహ్నానికి కొంచెం ముందుగా పదార్థాలు అన్నీ సిద్ధమయ్యాయి భగవాన్ భోజనానికి రండి అని ఆహ్వానించింది  ఆమ్రపాలి బుద్ధుడు భోజనం ముగించి పాత్రను ప్రక్కన పెట్టాడు చిన్న పీటపై కూర్చున్న ఆమ్రపాలి భగవాన్ మీ నాయకత్వం లోని ఈ భిక్షుసంఘానికి నా మామిడి తోపును కానుకగా ఇస్తున్నాను స్వీకరించండి అని వేడుకోగా బుద్ధుడు అంగీకరించాడు బుద్ధుని ధమ్మ బోధ తరువాత వెళ్ళిపోయింది  బుద్ధుడు ఆమ్రపాడి మామిడి తోటలో ఉన్నప్పుడు శీలసమాధి ప్రజ్ఞ లను పొందిన భిక్షువు లకు ఆశ్రవాలను తృష్ణ నలను తొలగించి దుఃఖము లేని శాశ్వత ఆనందాన్నిచ్చే నిర్వాణ పథo గురించి ధర్మ ప్రవచనాన్ని ఇచ్చాడు
--------------------------------------------------------
సమన్వయం ; డా. . నీలం స్వాతి 
కామెంట్‌లు