అన్నా చెల్లెలు
అక్కా తమ్ముడు
అమలిన ప్రేమకు
ఆత్మీయ వరాలు
అన్నంటే కొండంత
అండ
తమ్ముడుంటే
ధైర్యం గుండె నిండా.
అక్కంటే అనురాగ
పుష్పం
చెల్లంటే మమతల దీపం
ఒకరికొకరై
పెనవేసిన బంధం
కుటుంబానికే
అందం
అన్నా చెల్లెలు
అక్కా తమ్ముడు
కొసరిన ప్రేమలో
విరిసిన మల్లెలు
అన్నంటే హక్కు
తమ్ముడంటే
స్వతంత్రం
అక్కంటే
ఆత్మ సౌందర్యం
చెల్లంరాఖీ రాఖీ టే
చెరగని గారాబం
ఏది ఏమైనా
పుట్టింటికే జయం
రాఖీ పండుగ
విజయం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి