కవిహృదయం;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కవిహృదయం
విప్పాలని ఉంది
కవులస్వభావం
తెలపాలని ఉంది

మనసు
తెరవాలని ఉంది
ముందు
పెట్టాలని ఉంది

ప్రేమ
చాటాలని ఉంది
పొద్దు
గడపాలని ఉంది

మాటలు
చెప్పాలని ఉంది
ముచ్చట
పరచాలని ఉంది

అందాలు
చూపాలనిఉంది
ఆనందాలు
కలిగించాలని ఉంది

కోరిక
తీర్చాలని ఉంది
కుషీ
పరచాలని ఉంది

సరసాలు
ఆడాలని ఉంది
సరదాలు
చేయాలనిఉంది

అక్షరాలు
అల్లాలని ఉంది
పదములు
పేర్చాలని ఉంది

కవిత
వ్రాయాలని ఉంది
కమ్మగ
చదివించాలని ఉంది

కవులను
తలవండి
కవిహృదయాలను
ఎరగండి


కామెంట్‌లు