మేలుకో! ;- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 మేలుకో! మేలుకో ! 
మేలుకో మేధావీ నిద్ర మేలుకో! 
!!మేలుకో!!
జనశిక్షణ జనరక్షణ
జనజాగృతి చేయనెంచి
!! మేలుకో!!
పసిబాలల అభ్యున్నతి 
బడుగు వర్గ అభివృద్ధి 
గాంధి నెహ్రు కలలుగన్న 
నవభారత నిర్మాణం 
నీకు పరమ కర్తవ్యం 
!! మేలుకో!!
జన జీవన ప్రమాణాలు 
పెంచి పంచి హితము చేయ 
సమత పెంచ నడుంకట్టు 
దేశహితము అతిశయించ 
!!మేలుకో!!
తాడిత పీడిత జనులకు 
ఊత కర్రగానిలిచి 
దైన్య హైన్య జనావళికి 
భాసమాన హాసమేయ 
!!మేలుకో!!
దివ్యభారతాంబ ఋణం 
కొంతతీర్చి యశం పెంచి
మన రక్తపు చివరిబొట్టు 
సిందూరం గావించగ
!! మేలుకో!!
****************************************


కామెంట్‌లు
Ramakrishna Patnaik చెప్పారు…
మాష్టారూ ఇది చాలా మంచి గేయం! నేను బాణీ కట్టగలనో లేదో మరి!
అభినందనలు! -రామతాత
Ramakrishna Patnaik చెప్పారు…
మాస్టారూ...ఇది చాలా మంచి గేయం! నేను బాణీ కట్టగలనో లేదో మరి!
అత్యద్భుతం! -రామతాత
Ramakrishna Patnaik చెప్పారు…
మాష్టారూ... ఇది చాలా మంచి గేయం! నేను బాణీ కట్టగలనో లేదో మరి!
-రామతాత.