🌟శంకరాచార్య విరచిత🌟
శ్లోకం:
సకుంకుమ విలేపనా మలక చుంబి కస్తూరి కాం
సమందహాసి తేక్షణాం సశరచాప పాశాంకుశామ్ !
అశేష జన మోహినీం అరుణమాల్య భూషాంబరాం
జపాకుసుమ భాసురాం జపవిదౌ స్మరామ్యంబికా
మ్ !
భావం:
కుంకుమ కలిసిన విలేపనము పూసుకు న్నదీ, ముంగురులను తాకుచున్న కస్తూరి తిలకమును
ధరించినదీ,చిరునవ్వులతో కలిసిన కన్నులు కలదీ
పుష్ప బాణమును_చెఱకు వింటినీ_పాశాంకుశములను_ధరించినదీ.అశేష జనులను మోహింపచేయునదీ, ఎఱ్ఱని
పూలదండలను_ఆభరణములను_వస్త్రములను_ధరించినదీ_జపాపుష్పమువలె ప్రకాశించు చున్నదీ అగు జగదంబను జపము చేయు నెపుడు స్మరించెదను.
****
త్రిపుర సుందరి అష్టకం ;- కొప్పరపు తాయారు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి