మా పల్లె!!!;- డా.ప్రతాప్ కౌటిళ్యా
మేఘాలను తరిమిన గాలి 
నిప్పుల్లో మండుతున్న ఎండమావి 
గొంతు ఎండిన ఎడారి 
తుంటరి పిల్లవాగు
నల్లరేగడి నోరు 
ఎండిపోయిన ఇసుక 
రాలిపోయిన ఆకు 
కన్నీరు కార్చిన ఈత 
తలెత్తిన తాటి 
ఎండిపోయిన చేప పిల్ల 
కడుపు మండిన చెరువు 
తుళ్ళిపడిన తూనీగా 
దాగిన నేల పూసిన మల్లెతీగ 
నిద్ర గన్నేరుల ఏరు 
నిద్దుర పోయిన ఊరు 
పొద్దు పోడువని తూర్పు 
అదిరిపడిన ఆకాశం 
దిక్కులేని స్మశానం 
రాలి పడిన చంద్రుడు 
కొలిమిలో సూర్యుడు 
మండుతున్న మంచుకొండ
ఊపిరాడని అడవి 
కాలిన పచ్చగడ్డి గుండె 
కళ్ళు తిరిగినా చెలిమే
నల్లని కురుల నెమలి 
ఎత్తు పల్లాల్లో ఎగిరిపోయిన నీరు 
మత్తు వీడని మొగలి 
పరిమళించిన మోదుగ 
పరవాళ్ళు తొక్కిన మర్మం 
నెలవంక ముఖం 
వెండిపల్లెంలా నిండు పున్నమి 
నిండు బావిలో వెన్నెల 
గర్భిణిలా కర్బూజా 
నిండు చూలాలిలా కలింగ్రా
ఇది మా పల్లె రెక్కలు విచ్చిన బొడ్డుమల్లే!!!
డా.ప్రతాప్ కౌటిళ్యా 

కామెంట్‌లు