ఒకప్పుడు మన తెలుగు సినిమాలు చక్కని కధ, కధనాలు, హృదయాలను రంజింపజెసే సాహిత్యం, మధురానుభూతిని గొల్పే సంగీతం, కల కాలం మదిలో నిలిచి వుండే విధం గా నటీనటుల హావాభావాలు, నటన, హృదయాలను గిలిగింతలు పెట్టే నాయకా, నాయకల ప్రణయ సన్నివెసాలు, వెరసి సకుటుంబ సపరివారసమేతంగా చూడదగిన విధం గా రూపొందింపబడి తెలుగు ప్రజలనే కాకుండా మొత్తం భారత దేశానికే ఆదర్శవంతంగా నిలిచాయి. అందుకే ఆయా చిత్రాలు నిర్మింపబడి 50 సంవత్సరాలు దాటినా నేటికీ హాయిగా కూర్చోని చూసే పరిస్థితి వుంది. నాటి చిత్రాలలో నైతిక విలువలు, బాధ్యతలు, కుటుంబ జీవన విధానం, ఆదర్శప్రాయమైన నడవడిక, సక్రమ ప్రవర్తన ఎలా వుందాలో చాలా స్పష్టం గా చూపించేవారు. ఒక చిత్రం తీయడమంటే ఆ చిత్రం యూనిట్ దానిని ఒక బృహత్తర కార్యం లా, ఒక యజ్ఞ~ం లా భావించేవారు. ఒక పాతాళభైరవి, మాయాబజార్,మిస్సమ్మ, మూగమనసులు, అప్పు చెసి పప్పు కూడు లాంటి సినిమాలు అజారామరమైన చిత్రాలకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. అయితే దేశం లో చొచ్చుకు వస్తున్న పాశ్చాత్య ధొరణుల వలన మన సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు తీవ్రం గా విఘాతం కలుగుతొంది. అన్ని విషయాలలో విదేశీ సంస్కృతిని అనుసరించదం,అనుకరించడం ఒక ఫ్యాషనై పోయింది. ఇందులో భాగం గా కుడా మన తెలుగు సినిమాలలో విదేశీ పోకడలు ఎక్కువై పోయాయి. ఇప్పుడు ఏ సినిమాలో చూసినా మితి మీరిన హింస, హాస్యం పేరుతో ద్వందర్ధాలు, వికారం కలిగించే హీరో హీరొయిన్ల శృంగార ఘటనలు, అనైతికత, త్రాగుడు సన్నివేశాలు, జుగుప్స కలిగించే హీరోయిన్ల అర్ధ నగ్న ప్రదర్శనలు ఇత్యాది ఆశ్లీలతతో కుటుంబంతో కలిసి చూడాలంటేనే జుగుప్స కలుగుతోంది. ఇప్పుడు హీరో అంతే పనీ పాటు లేకుండా స్నేహితులతో కలిసి మందు తాగడం, సిగిరెట్లు కాల్చడం,అడ్డం వచ్చిన వారిని చితక్కొట్టడం. ఇక హీరీయిన్ అంటే హీరోతో ప్రేమ, ప్రణయ కలాపాలు సాగించడం కోసం, సగం దుస్తులతో ప్రేక్షకులకు కను విందు కలిగించడం కోసం సృష్టించబడిన ఒక పాత్ర. ఇక తెలుగు భాష పరం గా చూస్తే మన మాతృభాషకు తెలుగు సినిమాలలో జరుగుతున్న అన్యాయం వర్ణింపశక్యం కాదు. తెలుగు హిందీ, ఉర్దూ, ఆంగ్లం లాంటి భాషలను కలగాపులగం చేసి మట్లాడడం ఒక రివాజుగా మారింది. సినిమా అనేది ఒక మహత్తర సాధనం కనుకనే గతం లో సామాజిక అంశాలు, నైతిక విలువలు, భక్తి శ్రద్ధలు సమాజం లో చొచ్చుకుపోయేందుకు సినిమాలలో ఈ అంశాలను విధిగా వుండేలా సినిమా రచయితలు ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. కళా తపస్వి కే విశ్వనాధ్ పాశ్చాత్య సంస్కృతి మన సంస్కృతీ సంప్రదాయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న సమయంలో ఆద్యాత్మికత, భారతీయ కళా సంపద, లలిత కళలు, సంగీతం, నాట్యం వంటి వటిని పామరులకు కూడా అర్ధం అయ్యేలా సినిమాలలో జనరంజకంగా మలచడం వలన 1980 , 1990 వ దశకాలలో తెలుగు ప్రజలే కాక యావత్ భారతదేశం లో భారతీయత పట్ల ప్రజలకు గౌరవం అమితం గా పెరిగింది. అయితే నెడు కాసులు రాల్చుకోవడం మాత్రమే మా ధ్యేయం , సినిమా అనేది ఫక్తు వ్యాపారం మాత్రమే అని సగర్వంగా ప్రకటించుకునే వ్యాపార వేత్తలు సినిమా రంగం లో ప్రవేశించడం వలన సినిమాలలో విలువలు నశించిపోతున్నాయి.సినిమాల ప్రభావం ఎలక్ట్రానిక్ మీడియాపై కుదా పడింది. నెడు టి వి లలో వస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే ప్రతీ క్షణం వీక్షకుల మదిలో విషాన్ని నింపే ప్రక్రియ అప్రతిహతం గా ఆగుతోంది. సినిమాలు, ఎలక్ట్రానిక్ మీడియాలో సంస్క్రరణలు చెపట్టేందుకు శ్యాం బెనెగల్ అధ్యక్షతన ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ ఎన్నో విలువైన సూచనలు అందించినా అవన్నీ బుట్టదాఖలు కావడం మన దేశీయులు చెసుకున్న దురదృష్టం.
విలువలకు త్రిలోదకాలిస్తున్న మన చిత్ర పరిశ్రమ;- సి.హెచ్.ప్రతాప్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి