దేశంలో
యేటికో కోటి జనం
పుడుతూ
గూటి కోసం
మరి
కూటి కోసం
కటకటలాడుతూ
విద్దె గిద్దె లేక
వీరు
బీదరికపు రేఖ కింద
లుకలుకలాడుతూ
పశుప్రాయ జీవనం
విషప్రాయ ఆహారం
జన జీవన మతి భారం
మరి దీనికి పరిష్కారం?!
అతి గల వాటిని మితి చేసి
దేశాభ్యుదయం జతచేసి
జన జీవన సరళి మార్చి
నిర్విద్యా తిమిర సంహారం గావించాలి
దేశమంటే మట్టికాదని తెలిసీ
ఏం చేస్తున్నావోయ్ కలిసిమెలిసీ
అందుకే పద!
భుజం కలిపి, స్వరం కలిపి
యువశక్తికి, జనశక్తికి
విద్యా ఆజ్యం
యువ
జనం, ధనం
ఇంధనమై
నేరిమితో
పెను పేరిమితో
ఓరిమితో
బల్ కూరిమితో
సదమల వర్తన
సదయ హృదయ సద్ధర్మముతో
ముదమారగ
విద్యాధన సంచితులై
జనమంతా కదులుతుంటే
నవచైతన్యం
నవనవోన్మేషం కాదా!?
**************************************
నవచైతన్యం- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి