బుద్ధుని మహా పరి నిర్వాణం;- చిరసాని శైలూషి,నెల్లూరు.
 ఆనందా ఇది కాదు తథాగతుని గౌరవించవలసిన పూజించవలసిన సన్మానించవలసిన పురస్కరించవలసిన సంభావించవలసిన ఉపాశించవలసిన తీరు దానికంటే ఒక బిక్షువు గాని భిక్షుని  గాని ఒక ఉపాస కుడుగాని ఉపాశిక గాని ధమ్మబద్ధంగా జీవిస్తూ ధర్మ మార్గాల నడుస్తారో అప్పుడే తధాగతుని గౌరవించినట్లు అవుతుంది పూజించినట్లు అవుతుంది సన్మానించినట్లు అవుతుంది  అందుకని ఆనందా అందరూ మనం న్యాయమార్గాన ప్రవేశిద్దాం ధర్మబద్ధంగా జీవిద్దాం ధర్మ మార్గాలని నడుద్దా అడుగుతాం అనేటట్లు శిక్షణ ఇచ్చి అభ్యసించేట్లు చెయ్ మని బోధించాడు బుద్ధుడు అదే సమయంలో బుద్ధునికి ఎదురుగా నిలబడి విసన కర్ర వీస్తున్న గౌరవ్య ఉపవాసనను ఓ బిక్షువు నా ముందు నిలబడవద్దు ప్రక్కకు జరుగు అన్నాడు బుద్ధుడు.బుద్ధునికి ఎంతో కాలంగా సపర్య చేస్తూ వ్యక్తిగత సహాయకునిగా ఉన్న గౌరవ్య ఉపవాసను చివరి క్షణంలో తథాగతులు నా ముందు నిలబడి ఉండవద్దు ప్రక్కకు తప్పుకోమనడానికి కారణం ఏమై ఉంటుంది అని ఆనందుడు అనుకొని ఉండలేక బుద్ధుని అడిగాడు అందుకు బుద్ధుడు ఆనందా అనేకమంది దేవతలు తథాగతును చూడడానికి 10 రకాల ప్రపంచాల నుంచి వచ్చి ఉన్నారు ఈ సాలవనం చుట్టూ 12 క్రోసుల దూరం వరకు గుర్రపు వెంట్రుక మొన కూడా దూరనంత ఒత్తుగా దేవతలతో నిండిపోయి ఉంది. వారు తథాగతుని చూడాలని మేము ఎంతో దూరం నుంచి వచ్చాము సకల జీవరాసుల హితం కోసం సుఖం కోసం దుఃఖాన్ని నివారించి నిభాణ సుఖాన్ని అందించడం కోసం తథాగతుడు పుడుతూ సంబోధిని పొందుతూ ఉంటాడు.ఆ రాత్రి  చివరి జాములో తథాగతుడు మహాపరి నిర్వాణాన్ని పొందబోతున్నాడు మహనీయుడైన ఉపవాన అడ్డంగా నిలబడి చివరి క్షణంలో తధాగతను దర్శించే భాగ్యం లేకుండా చేస్తున్నాడని దేవతలంతా ఆందోళన చెందుతున్నారు ఆనందా అని వివరించాడు తధాకతుని మదిలో గల ఆ దేవతలు ఎవరు భగవాన్ అని అడిగాడు ఆనందుడు ఆనందా ఆకాశంలో ఉండి భూమి మీద ఏం జరుగుతుందో తెలుసుకోగల దేవతలు వారు జుట్టు పీక్కుంటూ విలపిస్తున్నారు చేతులు చాపి విలపిస్తున్నారు కిందపడి అటు ఇటు దొర్లుతూ విలపిస్తున్నారు ఇంకా ఇలా విలవిలలాడుతున్నారు త్వరలోనే తథాగతుడు మహా పరినిర్వాణాన్ని పొందబోతున్నాడు త్వరలోనే త్వరలోనే ఈ ప్రపంచంలో నుంచి ఒక దివ్య చక్షువు కనుమరుగు కాబోతుంది
=====================================
సమన్వయం ; డా. నీలం స్వాతి 

కామెంట్‌లు