శ్లో : ఘటోవా మృత్పండో ప్యణురపి చ ధూమోగ్ని రచలః
పటావో తంతు ర్వా పరిహరతి కిం ఘోరశమనమ్
వృధా కంఠ క్షోభం వహసి తరసా తర్క వచసా
పదాంభోజం శంభోర్భజ పరమ సౌఖ్యం వ్రజ సుధీః !
భావం: ఓ శాస్త్ర పండితుడా ! కుండ గాని, మట్టి ముద్ద గాని, అణువులు గాని, అగ్ని గాని, వస్త్రము మొదలగు తర్కశాస్త్ర పదములలో ఏవైనా కూడా భయంకరమైన మృత్యువు ను. తొలగింప లేవు. నీవు తర్కశాస్త్రముల కొరకు ఏల గొంతు చించు కొందువు ?శీఘ్రముగా దయాసముద్రుడు అయినా శివుని పాదపద్మములను భజింపుము గొప్ప ఆనందము అనుభవించి , మోక్షమును పొందుము.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి