ఆటల ద్వారా మానసిక శారీరక వికాసం పెంపొందునని, ఆరోగ్య ప్రయోజనాలు లభ్యమగునని ప్రముఖ వైద్యులు గార రవిప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (ఏపీయూటిఎఫ్) ఏర్పడి ఏభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజాంలో జరిగిన యుటిఎఫ్ స్వర్ణోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాజాం జి.సి.ఎస్.ఆర్ కళాశాల ఆవరణలో జరిగిన రాజాం నియోజకవర్గ స్థాయి క్రీడా వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఉపాధ్యాయులకు క్రికెట్, వాలీబాల్, షటిల్ బ్యాట్మెంటన్, చెస్ మొదలగు
ఆటలతో పాటు ఏకపాత్రాభినయాలు, పాటలు, పద్యాలు, కవితలు మొదలగు సాంస్కృతిక పోటీలను నియోజకవర్గస్థాయిలో నిర్వహించుట మిక్కిలి అభినందనీయమని ఆయన కొనియాడారు. నేడు జరిగిన షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో వై.కిశోర్, వి.సత్యంనాయుడు విన్నర్స్ గా, కె.హరి, జి.సింహాచలం రన్నర్స్ గా గెలుపు సాధించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు రెడ్డి మోహనరావు, ఎస్.కిశోర్ కుమార్, జిల్లా అధ్యక్షులు రమేష్ పట్నాయక్, జె.వి.ఆర్.కె ఈశ్వరరావు, జిల్లా కార్యదర్శి పక్కి వాసు, బి.రామినాయుడు, రాష్ట్ర కౌన్సిలర్ చుక్కా వైకుంఠరావు, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు మారెళ్ళ కృష్ణమూర్తి, ఎ.వెంకట అప్పల నాయుడు, డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు గిరడ చంద్రశేఖర్ నాయుడు, గేదెల రమేష్, నియోజకవర్గంలో గల నాలుగు మండలాల అధ్యక్ష కార్యదర్శులు మువ్వల రమేష్, బలివాడ నాగేశ్వరరావు, బాలకృష్ణ, ఎం ప్రసాద్, జి.విష్ణుమూర్తి, వి.సత్యంనాయుడు, నిర్వహణా కమిటీసభ్యులు ఎం.శ్రీనివాసరావు, వై.భాస్కర్, బి.శ్రీనివాసరావు, పి.మురళి. డి.రామారావు తదితరులు పాల్గొన్నారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి