కడలితో కరిమబ్బు
వానతో నేల
నేలతో చెట్టు
చెట్టుతో మనిషి -
ప్రకృతి ఏర్పరుచుకున్న
ఓ బలమైన బంధం...
స్నేహం ప్రకృతిలాగే -
మనిషిని విస్తరిస్తూ
మనిషిని వికాసిస్తూ, వనంలా...
స్నేహం చెట్టులాగే -
కొత్త చిగుళ్ళతో
పాత మూలాలతో, దృఢంగా...
స్నేహం ఔషధంలా -
మరకల్ని చెరిపేస్తూ
మరణాన్ని దూరం చేస్తూ
సజీవంగా సగర్వంగా ...
స్నేహం ఒక చావులేనితనం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి