జీవులపై ప్రేమను చూపండి-దేవుని ప్రేమను పొందండి.సరియైన మార్గములో నడవని వారు దేనిని సద్వినియోగము చేసుకోలేరు అంటుంది మన సనాతన ధర్మం. కృష్ణుడి జీవితమే ఒక మానవ జీవన అనుభవసారం.. మూర్తీ భవించిన వ్యక్తిత్వ వికాసం. కృష్ణుడంటేనే అలౌకిక ఆనందానికి ప్రతిరూపం.. సచ్చిదానంద రూపం.. సత్‌చిత్ ఆనంద స్వరూపం.. పాపాల్ని నాశనం చేసేదే కృష్ణ తత్వం..
బాల్యంలోనే తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు. వెన్న ముద్దలు ఎక్కువ, ఇష్టంగా తినేవాడు.వెన్న జ్ఞానానికి సంకేతం. వెన్న నల్లని కుండలలో కదా ఉండేది. ఆజ్ఞానికి సంకేతం నల్లని కుండ, వెలుగుకు, విజ్ఞానానికి చిహ్నం తెల్లని వెన్న. తన భక్తుల మనసులోని ఆజ్ఞానమనే చీకటిని తోలగించి, జ్ఞానమనే వెలుగును నింపడం కోసమే కన్నయ్య వెన్న తినేవాడు.
స్నేహితులంటే కృష్ణుడికి ఎంతో ప్రేమ. కృష్ణుడి జీవితాన్ని గమనిస్తే.. స్నేహితులను కుటుంబ సభ్యులుగానే ప్రేమించాడు. చెప్పకుండానే స్నేహితుల కష్టాలన్నీ తెలుసుకుని వాటిని తీర్చేశాడు.ప్రేమ, సేవా తత్వాలకు ప్రతిరూపంగా నిలిచాడు.కేవలం మనుషులనే కాదు.. పశువులను కూడా ప్రజలతో సమానంగా ప్రేమించడం ఆ చిన్నికృష్ణుడికే చెల్లింది. ఇలా తన జీవితం ద్వారా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న సత్యాన్ని నేర్పాడు.తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలు చూపించాల్సిన అవసరం ఎంత ఉందో తన జీవితం ద్వారా చెప్పాడు ఆ యశోద తనయుడు. రాధాకృష్ణుల ప్రేమ అనిర్వచనీయమైనది. వారిద్దరి ప్రేమలో ఎటువంటి స్వార్థం కనిపించదు. మనం కూడా అలానే ఉండాలని ఆ రాధావల్లబుడి ప్రేమ చాటిచెప్తుంది. ఏమీ ఆశించకుండా ఇతరుల పట్ల నిస్వార్థమైన ప్రేమ చూపించాలని, ఎవరి నుంచైనా తీసుకోవడం కంటే.. ఇవ్వడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని ఆయన ప్రేమ తత్వం బోధిస్తుంది.అసలైన ప్రేమను అర్థం చేసుకునేవారికే కృష్ణుడి ఆరాధన కూడా అర్థమవుతుంది. అదొక మానసిక భావం అంతే!! కృష్ణుడికి పదహరువేల మంది భార్యలు అని గేలి చేసేవాళ్ళు ఉన్నారు కానీ వాళ్లందరిని నరకాసురుడి బారి నుండి కాపాడి వాళ్లకు సంరక్షణ కల్పించడానికి వాళ్ళను భార్యలుగా స్వీకరించాడు తప్ప వాళ్ళతో శారీరక సంబంధం అణుమాత్రమైనా లేదు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి