దిగులుల- డా.గౌరవరాజు సతీష్ కుమార్
 అందమైన సూర్యోదయాన్ని చూస్తూ
అది శాశ్వతం కాదని దిగులు 
అందమైన జలపాతాన్ని చూస్తూ 
అది ఎప్పుడూ ఉండదని దిగులు 
అందమైన తాజ్ మహల్ చూస్తూ 
తిరిగి వెళ్ళిపోవాలనే దిగులు 
అందమైన తోటను చూస్తూ 
కలకాలం ఉండదని దిగులు
అందమంతా దిగులే
దిగులే విషాదం
విషాదమే జీవితం
విషాదాన్ని ఆనందించగలవాడే
జీవితాన్ని ఆనందించగలడు
విషాదాన్ని ఆనందించడం అంటే
తనని తాను పోగొట్టుకోవడం
కాని, 
ఇది ఎవరికి చేతనవుతుంది?!
**************************************


కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
బాగుందండీ