న్యాయాలు-584
పద్మపత్ర స్థిత తోయ న్యాయము
*****
పద్మపత్ర అంటే తామర ఆకు.స్థిత అంటే ఉన్నది. తోయం అంటే నీరు లేదా ఉదకం అని అర్థము.
నీటిలో ఉన్నటువంటి తామరాకును లేదా తామరాకుపై ఉన్న నీటిని గురించి తెలిపేదే ఈ "పద్మ పత్ర స్థిత తోయ న్యాయము.
ఈ పద్మ పత్రాలు ఆకుపచ్చ రంగులో గుండ్రంగా వెడల్పాటి పళ్ళెంలా నీటి మీద తేలుతూ ఎంతో అందంగా కనిపిస్తాయి.ఈ తామరాకులు ఉన్న చెరువు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇక వీటిపై పడిన నీటి బిందువులు ముత్యాల వలె మెరుస్తూ ఆకును ఎటు కదిపితే అటు కదలడం చూడవచ్చు. వీటి పుట్టుక పెరగడం, నశించడం అంతా నీటిలోనే అయినప్పటికీ నీరు వీటిని తడప లేక పోవడం ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
అందుకే భగవద్గీతలో మనిషి ఎలా వుండాలో పద్మపత్రంతో పోల్చి చెప్పిన శ్లోకాన్ని చూద్దాం.
బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః/లిప్యతే న స పాపేన పద్మపత్ర మివాంభసా!"
అనగా ఎవరైతే తమ కర్మలను పరమాత్మకు సమర్పించి,ఆసక్తిని విడిచి అనగా నిష్కామ కర్మ ఆచరిస్తారో అటువంటి వారు నీరు అంటని తామరాకు వలె అనగా తామరాకును నీరు ఎంత మాత్రం తడుపలేనట్లే, తామరాకుపై నీటి బిందువు ఆకును తాకనట్లే ఈ భౌతిక ప్రపంచంలో పుట్టి ఇక్కడే పెరిగి,ఇక్కడే నివసించే జ్ఞాని కూడా బంధాలు అనుబంధాలు, పాపపుణ్యాలు మొదలైన ద్వందాలు అంటకుండా బంధరహితమైన జీవితాన్ని గడుపుతాడు అని అర్థము.
ఇక్కడ ద్వందములు అంటే పాపపుణ్యాలు , బంధాలు అనుబంధాలే కాదు సుఖదుఃఖాలు, జయాపజయాలు, రాగద్వేషాలు మొదలైనవన్నీ ద్వందములే.ఇవి ఒకదానితో ఒకటి నీడగా వుంటూ అనుభవాలను కూడా అలాగే ఇస్తుంటాయి.ఈ ద్వందములను అధిగమించుట అనేది సామాన్యమైన విషయం కాదు.
అందుకే తామరాకు మీద నీటి బిందువు వలె కోరికల ఆకులను తాకకుండా,వ్యామోహాల సూర్య కిరణాలకు ఆవిరై పోకుండా మనిషిగా తన జీవితాన్ని తామరాకులా గడపాలనే ఉద్దేశ్యంతో ఈ "పద్మపత్ర స్థిత తోయ న్యాయము"ను మన పెద్దలు ఉదాహరణగా చెబుతుంటారు.
పద్మ పత్రంలా ఉండాలని అంటూనే భగవద్భక్తులు పరమాత్మకు మన కర్మలతో పాటు "పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్ఛతి/తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రియతాత్మనః!/ " సమర్పించాలి అంటారు.
అనగా ఎవరైతే నాకు పత్రమైనను,పుష్పమైనను,ఫలమైనను, చివరకు ఉదకమైనను భక్తితో సమర్పిస్తారో... వాటిని నేను ప్రీతితో స్వీకరిస్తాను " అంటాడా పరమాత్మ.
దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మన దేహాన్నే భావం బంధాలు అంటని తామర పత్రంగానూ, మనసును స్వచ్ఛతకు ప్రతిరూపమైన పువ్వుగానో ఫలం,తోయంలా ఇతరులకు ఉపయోగపడే పండ్ల చెట్టుగానో, దాహం తీర్చే జలంగానో అర్పించుకుందాం. అప్పుడే పండుటాకులా రాలిపోయే ఈ జన్మకు సార్థకత చేకూరుతుంది.
ఇదండీ! "పద్మ పత్ర స్థిత తోయ న్యాయము" ద్వారా మనం గ్రహించవలసిన జ్ఞానం.అంతే కదండీ .

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి