కర్నూలు జిల్లా,పెద్దకడబూరు మండల పరిధిలోని కంబదహాళ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు గద్వాల సోమన్న రచించిన 55వ పుస్తకం "కడలి కెరటాలు" పుస్తకావిష్కరణ కార్యక్రమం యూటీఫ్ ఎమ్మిగనూరు శాఖ ఆధ్వర్యంలో అదే కార్యాలయంలో,వైస్సార్ సర్కిల్, ఎమ్మిగనూరు,కర్నూలు జిల్లాలో రచయిత్రి,యూటీఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి నాగమణి,యూటీఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీ మల్లారి నాగరాజు,శ్రీ.వై.ఎల్లప్ప,శ్రీ దావీదు,శ్రీ పౌరోహితం శ్రీనివాసులు,శ్రీ డి.కేశవయ్య మరియు విచ్చేసిన ప్రముఖుల చేతుల మీద ఘనంగా జరిగింది. అనంతరం ఈ పుస్తకాన్ని కవిరత్న,సోదర కవిమిత్రుడు, సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ ఆరెకటికె నాగేశ్వరరావు గారికి అంకితమివ్వడం విశేషం.అనతి కాల వ్యవధిలో 55పుస్తకాలు వ్రాసి ముద్రించిన శ్రీ గద్వాల సోమన్న గారిని,కృతి
స్వీకర్త నాగేశ్వరరావు గారిని,విచ్చేసిన అతిథులను సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్రపాల్,కౌలన్న,శ్రీ పాపయ్య,వై రామాంజనేయులు, శ్రీ.బి.రాఘవేంద్ర,శ్రీ కె.వీరప్యాసద్,విశ్రాంత గ్రంథాలయ శాఖ అధికారి శ్రీ నీరుగంటి వెంకటేశ్వర్లు,శ్రీ కరుణం పాపన్న,శ్రేయోభిలాషులు, సాహితీమిత్రులు మరియు పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి