ఆటోమేటిక్ ట్రాఫిక్ లైట్ ఆవిష్కర్త గారెట్ మోర్గాన్. అతను ఆఫ్రో అమెరికన్. అతను తన వినూత్న ప్రయోగాలకు ప్రసిద్ధి. 1923లో, అతను ఆటోమేటిక్ ట్రాఫిక్ లైట్‌కు పేటెంట్ పొందాడు. ఇదిలా ఉండగా, అతనికన్నా ముందర లండన్‌లోని రైల్వే సిగ్నలింగ్ ఇంజనీర్ అయిన జాన్ పీక్ నైట్ 1868లో మొదటి ట్రాఫిక్ లైట్‌ను కనిపెట్టిన ఘనత పొందారు.
ట్రాఫిక్ లైటును వాహనాల ట్రాఫిక్‌ను సురక్షితంగా సమర్ధవంతంగా నియంత్రించడానికి హెచ్చరిక సంకేతాలు ఉండేలా రూపొందించిన వ్యక్తి మోర్గాన్. ఆధునిక నగరాల్లో రహదారి భద్రతను మెరుగుపరచడానికి ఈ ఆవిష్కరణ ప్రాథమికమైనది.
ట్రాఫిక్ లైట్‌తో పాటు, విష వాయువులు, కార్బన్ మోనాక్సైడ్ నుండి రక్షించే గ్యాస్ మాస్క్‌ను కూడా మోర్గాన్ కనుగొన్నాడు. ఓ గనిలో విషాదాన్ని చూసిన తర్వాత, అందులో చిక్కుకున్న కార్మికులను రక్షించడంలో అతను సహాయం చేశాడు. అతని గ్యాస్ మాస్క్ విస్తృతంగా ఉపయోగించే వారు. మంటలు, పారిశ్రామిక అత్యవసర పరిస్థితుల్లో అనేక మంది ప్రాణాలను ఈ మాస్క్ కాపాడింది.
ఈ ఆవిష్కరణలు మోర్గాన్ సాంకేతిక నైపుణ్యాన్ని మాత్రమే కాకుండా, ప్రజా భద్రత, సంక్షేమం పట్ల అతని నిబద్ధతను కూడా ప్రతిబింబించేలా యి.
ఇతని పూర్తి పేరు గారెట్ అగస్టస్ మోర్గాన్ (సీనియర్). వ్యాపారవేత్త సమాజ సేవకుడిగాను గుర్తింపు పొందాడు. అతని అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణలు - ట్రాఫిక్ లైట్. రక్షిత 'స్మోక్ హుడ్'. అతను తన హెయిర్ ప్రొడక్ట్ ఆవిష్కరణల ఆధారంగా "జీఏ మోర్గాన్ హెయిర్ రిఫైనింగ్ కంపెనీ" అనే విజయవంతమైన కంపెనీని నెలకొల్పాడు. హెయిర్‌కేర్ ఉత్పత్తుల పూర్తి శ్రేణితో పాటుగా ఆఫ్రికన్ అమెరికన్ల పౌర, రాజకీయ పురోగతిలో పాలుపంచుకున్నాడు. ముఖ్యంగా ఒహియోలోని క్లీవ్‌ల్యాండ్, చుట్టుపక్కల ప్రాంతాలలో తన కార్యకలాపాలు కొనసాగించాడు.
1877లో జన్మించిన మోర్గాన్ తండ్రి సిడ్నీ మోర్గాన్. విముక్తి పొందిన ఓ బానిస. అతని తల్లి బానిసగా ఉండి విముక్తి పొందిన వారే.
గారెట్ మోర్గాన్ పదకొండు మంది పిల్లలలో ఏడవవాడు. మోర్గాన్ కెంటుకీలోని క్లేస్‌విల్లేలోని బ్రాంచ్ ఎలిమెంటరీ స్కూల్‌లో ఆరవ తరగతి వరకు చదువుకున్నాడు. పద్నాలుగో ఏట సిన్సినాటికి పని కోసం వెళ్లాడు.
మోర్గాన్ తన యుక్తవయస్సులో ఎక్కువ కాలం ఓ భూస్వామి దగ్గర పని చేశాడు. అనేక మంది ఆఫ్రో అమెరికన్ పిల్లల్లా ఇతనుకూడా పని చేయడం కోసం చిన్న వయస్సులోనే పాఠశాలను విడిచిపెట్టాడు. వచ్చింది.
అయితే మోర్గాన్ పని చేసుకుంటూనే ఒక ట్యూటర్ వద్ద చదువు కొనసాగించాడు. 1895లో, అతను క్లీవ్‌ల్యాండ్‌కి వెళ్లాడు. అక్కడ అతను ఒక వస్త్ర తయారీదారు కోసం కుట్టు యంత్రాలను మరమ్మతు చేయడం ప్రారంభించాడు. ఈ కాలంలో చేసిన అతని మొదటి ఆవిష్కరణ, కుట్టు యంత్రాల కోసం బెల్ట్ ఫాస్టెనర్. మోర్గాన్ కుట్టు యంత్రాల కోసం జిగ్‌జాగ్ అటాచ్‌మెంట్‌ను కూడా కనుగొన్నాడు.
1907లో, మోర్గాన్ కుట్టు యంత్రాల దుకాణాన్ని ప్రారంభించాడు. అనంతరం అతను తన భార్య మేరీ అన్నేతో కలిసి లేడీస్ బట్టల దుకాణాన్ని ప్రారంభించాడు. ఈ దుకాణం ద్వారా కోట్లు, సూట్లు, దుస్తులు ఉత్పత్తి చేసారు. ఈ సంస్థలో 32 మంది ఉద్యోగులు పని చేసేవారు.
1913లో, అతను పేటెంట్ పొందిన హెయిర్ స్ట్రెయిటెనింగ్ క్రీమ్, హెయిర్ కలరింగ్, హెయిర్ కేర్ ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉండేది. ఈ క్రమంలోనే మోర్గాన్ స్ట్రెయిటెనింగ్ దువ్వెనను తయారు చేశాడు.
1914లో తన స్మోక్ హుడ్ డిజైన్ కోసం పేటెంట్ పొందిన ఇతను అదే సంవత్సరం, నేషనల్ సేఫ్టీ డివైస్ కంపెనీని ప్రారంభించాడు. ఈ ఆవిష్కరణకు అతనికి న్యూయార్క్ నగరంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ప్రదర్శనలో మొదటి బహుమతిని సంపాదించిపెట్టింది.
మోర్గాన్ 1923లో ఒక కూడలి వద్ద ఒక భయంకరమైన ప్రమాదాన్ని చూసిన తర్వాత ట్రాఫిక్ సిగ్నల్‌ను రూపొందించాడు. అతని మాన్యువల్‌గా పనిచేసే డిజైన్‌లో "గో", "స్టాప్" సంకేతాలుండేవి.
తరువాత జీవితంలో అతను గ్లకోమాతో 1943 నాటికి కంటిచూపు కోల్పోయాడు. అతను 1963 జూలై 27న, 86 ఏళ్ళ వయస్సులో మరణించాడు. క్లీవ్‌ల్యాండ్‌లోని లేక్ వ్యూ శ్మశానవాటికలో ఖననం చేశారు.
దైనందిన జీవితంలో అత్యవసర పరిస్థితుల్లో ఆవిష్కరణ ఎలా గణనీయమైన మార్పును కలిగిస్తుందో చెప్పడానికి అతని వారసత్వం ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణగా ఉంది.
-
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి