భగవద్గీత అధ్యాయం 13, శ్లోకం 25
ధ్యానేనాత్మని పశ్యంతి
కేచిదాత్మానమాత్మనా |
అన్యే సాంఖ్యేన యోగేన
కర్మయోగేన చాపరే ||
తాత్పర్యము : పరమాత్ముని కొందరు ధ్యానము చేతను, మరికొందరు జ్ఞానాభ్యాసము చేతను, ఇంకను కొందరు నిష్కామ కర్మ చేతను తన యందే దర్శింతురు.
ఎవరైతే ఆత్మ గురించి తెలుసుకోవడానికి ఇంద్రియాలను ఉపయోగిస్తారో వారికి. ఇంద్రియాలకూ, ఆత్మకూ మధ్య విభజన లేనంత కాలం ఇలా అన్వేషించేవారు ఆత్మ సమగ్ర స్వరూపాన్ని అర్థం చేసుకోలేరన్నాడు శ్రీకృష్ణుడు.ఆత్మాన్వేషణను ముందుగా స్థూల శరీర పరిమితులను విశ్లేషించుకుంటూ ప్రారంభించి, ఆపై సూక్ష్మ శరీరాన్ని ఆపై కారణ శరీరాన్ని దాటుకొని మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేబడే స్థితులను అధిగమించగలిగితే మిగిలేది ఆత్మే.అన్నిటికి మూలం ఆత్మే అని ఆగిపోకుండా, ఆ ఆత్మను, దాని మూలాలను వెతుక్కుంటూ ఉండాలి. ఎందుకు వెతకాలి? అదే అసలు మనం కనుకా! లోచూపు కావాలి. లోనారసి అంటే లోపలకు వెళ్లి, చూచి, అనుభవించి, అనుభూతిని పొంది, విభూతి స్థాయిని అందుకోవాలి. నమ్మకమే లేని స్థితి, నమ్మీ నమ్మని స్థితి, నమ్మకమే నడిపించే స్థితి మానవ జీవితంలో అనివార్యమైన స్థితులు.తన్ను తాను తెలుసుకోడానికి పూర్వులు సర్వసంగ పరిత్యాగులై తపోవనాలకు తరలిపోయేవారు. ఇప్పుడు ఆధునికులు సమాజంలోనే ఉంటూ సంసార జీవనం గడుపుతూ ఎవరో ఒక గురువును ఆశ్రయించుకొని తమలోని జిజ్ఞాసను తీర్చుకొంటున్నారు. ఆత్మాన్వేషణ తత్పరులవుతున్నారు.శరీరాన్ని ఎంత తక్కువ ప్రేమిస్తే ఆత్మకు అంత చేరువ అవుతామనే వారు రమణులు. దేహభ్రాంతి మనిషి ఆధ్యాత్మిక ఉన్నతికి అడ్డంకి కలిగిస్తుందని ప్రబోధించేవారు. పారమార్థిక జ్ఞాని మానసికస్థితి ఎలా ఉంటుందో స్పష్టం చేస్తూ ‘జ్ఞాని అయినవాడు కూలికి బరువు మోసినట్లే ఈ దేహాన్ని మోస్తాడు. గమ్యస్థానం వచ్చేది ఎప్పుడా? ఎప్పుడా? అని ఎదురుచూస్తాడే కానీ! ఏవో ప్రయత్నాలు చేసి ఈ బరువును ఇంకా మోయాలనుకోడు! సరైన జ్ఞానం కలిగితే, ఈ శరీరం ఎవరికి కావాలి? సదా నిర్మలంగా ఉండే తనకు ఈ మోత బరువెందుకు?’ అని ఉపదేశసారం గ్రంధంలో రమణ మహర్షి అన్నారు.కర్మ సన్యాస యోగం మన మనస్సులోని కర్మల నుండి విముక్తి పొందటానికి, ఆత్మను పరిపూర్ణంగా పొందటానికి మార్గం చూపిస్తుంది. భగవద్గీతలోని ఈ భాగం మనకు జీవితంలో సత్యం, ధర్మం, ఆత్మాన్వేషణ గురించి అద్భుతంగా బొధిస్తుంది. హనుమంతుడు భగవంతుని నుంచి వేరుపడిన జీవుని ( సీత ) అన్వేషణకై బయలుదేరాడు. అన్వేషణ ఎందుకు? అన్వేషించి ఆ జీవుని పరమాత్మతో కలపడానికే అంటే సీతాన్వేషణలో అంతర్గతముగా వున్నది ఆత్మాన్వేషణ యే.అత్మాన్వేషణకి ముఖ్యము గురువు.ఆ గురువే హనుమంతుడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి