సుప్రభాత కవిత ; -బృంద
అణువణువూ తాకే
అభిమాన కిరణాలు
అప్రతిహతంగా అందించే
అపురూప స్నేహ హస్తాలు

పరచుకుంటూ వెలుగులు
పంచుతూ పెంచుకునే బంధాలు
అక్షయంగా అభయమిస్తూ
ఆర్తిగా అల్లుకునే ఆప్యాయతలు

మనసు మురిసే ముచ్చటగా
కురిపించు కరుణ దీవెనలుగా
మరిపించు మహిమ మందుగా
నడిపించు ముందుకు నేతగా...

మానవత్వపు పరిమళాలు
ప్రతిమనసున  ప్రసరింపచేసి
ఆర్తులకు ఆపన్నహస్తంగా
అరుదైన సేవలు అందింపగా..

కదిలివచ్చిన మనసులతో
కలిసి సాగాలనే కోర్కె పెంచి
కమ్ముకున్న కలత తీర్చే
కమ్మని సేవకు రమ్మని పిలుస్తూ...

నెమ్మదిగ నెలవులు మార్చి
పదిలముగ భద్రతనిస్తూ..
భీతిల్లిన హృదయాలకు
అతివేగముగ చేయూతనిస్తూ..

ఆగ్రహించిన గంగను
అనుగ్రహించమని ప్రార్థిస్తూ
నిగ్రహించి నీటి ముంపు నాపి
సంద్రాన్ని చేర సాగిపొమ్మని

వేడుకుంటూ వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు