ఏరుకుంటుంటాడు
ఏదైనా చిక్కుతుందేమోనని
వెదుకుతుంటుంటాడు
ఏమైనా దొరుకుతుందేమోనని
తిరుగుతుంటుంటాడు
ఎక్కడైనా ఊహలుతడతాయేమోనని
తలగీకుకుంటుంటాడు
ఏవైనా తలపులుపుడతాయేమోనని
చుట్టూచూస్తుంటాడు
చక్కదనాలుంటాయేమోనని
చప్పుడులువింటుంటాడు
చతురోక్తులువాడుకోవచ్చునేమోనని
చల్లాలనుకుంటుంటాడు
అక్షరసౌరభాలని
అల్లాలనుకుంటుంటాడు
పదపుష్పాలమాలలని
ప్రయాసపడుతుంటాడు
దున్నటానికి
విత్తటానికి
నీరుపెట్టటానికి
కైతలపంటకొయ్యటానికి
శ్రమిస్తుంటాడు
బంకమట్టితేవటానికి
అడుసుతొక్కటానికి
అచ్చుపోయటానికి
కవితాబొమ్మలుచేయటానికి
గీతలుగీస్తుంటాడు
కుంచెనుపట్టుకొని
రంగులనద్దుకొని
క్యాన్వాసుపైపూసి
కవనచిత్రాలనుసృష్టించటానికి
చెక్కుతుంటాడు
ఉలినిచేపట్టి
రాయినిచెక్కి
చెమటలుక్రక్కి
కయీతాశిల్పాలనుతయారుచేయటానికి
కష్టపడుతుంటాడు
ఊహలనూరించి
విషయాలుసేకరించి
భావాలుగామార్చి
కవితలుకూర్చటానికి
రాత్రింబవళ్ళు
రాయటానికి
చదివించటానికి
మదులుదోచటానికి
కవికదేధ్యాస అదేపని
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి