🪷శివానందలహరి;- కొప్పరపు తాయారు

 శ్లో:  ధర్మోమే చతురంఘ్రిక స్సుచరితః  పాపం వినాశనం గతం
కామక్రోధమధాదయో విగళితాః కాలాస్సుఖావిష్కృతః 
జ్ఞానానంత్యమహౌషధి స్సుఫలితా కైవల్య నాథే సదా
మాన్యే  మానస పుండరీక నగరే రాజావతంసే స్థితే !!

    భావం :      
 పూజ్యుడు, చంద్రశేఖరుడు, రాజా      
 వసంతుడు, శివుడు, నాహృదయం అనేడి
 నగరమును, పరిపాలిస్తుండగా , ధర్మము నాలుగు పాదములతో నడుస్తున్నది. పాపం  నశించెను. కామ, క్రోధ, మద, మాత్సర్యములు
పారిపోయిను‌ . జ్ఞానముతో కూడి మోక్షము అనే గొప్ప ఔషధి ఫలించెను. 
                 *******

కామెంట్‌లు