గిరి లోయల జారుతూ
సిరి చినుకుల కూడుతూ
విరి తావుల మోస్తూ
చిరు ధారగ ప్రవహిస్తూ....
వెలుగు కిరణపు స్పర్శలో
వెలుగు జగతికి రక్షగా
వెలుగు చూపుతూ సాగే
వెలుగు పరుగల్లే పరుగెత్తే
అలుపు లేని పయనమై
మలుపులెన్ని వచ్చినా
గెలుపు బాటను కదిలిపొమ్మని
తెలుపు చక్కని పాఠమై!
రమ్యమైన దారిలో
భవ్య సుఖములనొసగుతూ
దివ్య ప్రేమను పంచుతూ
గమ్యమైన కడలి వెదుకుతూ...
నేలను మొలిచే గరికకు సైతం
సలిలధారగా జీవం పోసి
ఫలితమేమీ కోరకనే
పరుగు పరుగున ప్రవహిస్తూ...
ఒడ్డున పెరిగే జీవరాశులకు
ఒడుపుగ దాహం తీరుస్తూ
ఒకటే మనమని చాటుతూ
ఒరిసి మురిసి పోయే జలమై
నడిచిన నేలకు వసంతమై
గడిచిన కాలపు మరందమై
విడచిన తోయపు శరమై
కడలిని చేరువరకు పరుగాపని
నవ్యజలధారకు
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి