భారత కల్చరల్ అకాడమీ మరియు తెలుగు టెలివిజన్ రచయితల సంఘం సంయుక్తంగా హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ఈనెల 9వ తేదీన ప్రజాకవి కాళోజీ స్మారక జాతీయస్థాయి కవిసమ్మేళనం - 2024 నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్. రత్నలక్ష్మి అసిస్టెంట్ ఇంజనీర్ సాగర సందేశం అనే కవితను జనరంజకంగా వినిపించి ప్రేక్షకుల, కవివరేణ్యుల ప్రశంసలను అందుకున్నారు. తెలుగు సాహిత్యరంగంలో అనన్య సేవలను అందజేస్తున్న నంద్యాలలోని జల వనరుల శాఖకు చెందిన తెలుగుగంగ ప్రాజెక్టు అసిస్టెంట్ ఇంజనీరైన ఎస్.రత్నలక్ష్మిని చక్కని శాలువాతో బాటుగా అందమైన జ్ఞాపిక మరియు ప్రశంసాపత్రంతో తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ స్థాపక అధ్యక్షుడు నాగబాల సురేష్ కుమార్, సినీ దర్శకుడు ప్రభాకర్ జైన్, సినీగేయ రచయిత సాధనాల వెంకటస్వామి నాయుడు, తెలుగు టీవీ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, మౌనశ్రీ మల్లిక్, అప్పాల చక్రధర్, విజయబాల ఫౌండేషన్ చైర్మన్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సహకవులు బంధుమిత్రులు రత్నలక్ష్మిని అభినందించారు.
నంద్యాల అసిస్టెంట్ ఇంజనీరుకు కాళోజి స్మారక పురస్కారం - 2024

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి