నాకొడుకు సక్కంగ చదువు తున్నాడే :- అంకాల సోమయ్య-దేవరుప్పుల- జనగాం -9640748497

 పల్లవి:
నా కొడుకు సక్కగ
చదువు తున్నాడే
చదువు తున్నాడే
1చరణం;
అవ్వ అయ్యను మరిచి
మమ్మిడాడండే
మమ్మిడాడంటే2
2చరణం; 
గివ్విట్టు అన్నాడు
టేకిట్టు అన్నాడు
గివ్వింటుఅంటేను
గీకుమన్నట్టో
గోకుమన్నట్టో2
/నా కొడుకు/
3చరణం; 
మమ్మి మమ్మి 
నాకు పప్పియ్యమండు
పప్పియ్యమండు
పప్పియ్యమంటేను
పప్పేయమండో
పెరుగేయమండో2
/నాకొడుకు/
4చరణం;
వచ్చిరాని చదువు
ఒళ్ళంతా పలుగు
ఒళ్ళంతా పలుగు
అమ్మ భాష మనకు
సంభాషణీయం2
/నా కొడుకు /
5చరణం;
అమ్మ చనుబాలతో
అలవడేభాష
అలవడేభాష2
6చరణం;
బడిలోన బడి బయట
అమ్మభాష మాట్లాడు
ఉపాధి ఉద్యోగం
అమ్మ భాష
చూపాలి 2

కామెంట్‌లు