చిరంజీవులు:-అంకాల సోమయ్య- దేవరుప్పుల-జనగామ-9640748497
మానవజాతికి మూలవాసులవుతానే
సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలవుతారువారు

వయోవృద్ధులు కాదు వారు
మానవతా వృక్షాలు

సమాజమనే వృక్షానికి విత్తనాలవుతూనే
మానవజాతి మనుగడకు కారణభూతులవుతారు

వృద్ధులు ఉండవలసినది మనింట్లోనే 
వృద్ధాశ్రమంలోకాదు

మానవ సమాజానికి మూలస్థంబాలవుతూనే
సమసమాజానికి మార్గదర్శకులవుతారు

వృద్ధులు లేని సమాజం పల్లెలే లేని ప్రపంచం

వారు ఉద్యోగ జీవితాన్ని ఉద్యమంగా పూర్తిచేసి
జీవితాన్ని జీతాన్ని అంకితమర్పిస్తారు

బిడ్డల బాగుకోరిన పెద్దలే వృద్ధులు

ఛీ కొట్టినచోటే శిలలై ఉంటూ శత్రువును సైతం శపించని దయామయులు

కోట్లు సంపాదించిన కూటికి నోచుకోని మహనీయులు

చెట్టుపైన పక్షులన్నీ ఎగిరిపోయినా
మళ్ళీ తిరిగివస్తాయనే ఆశతోనే జీవిస్తారు

బ్రతుకు నాటకాన్ని జయించిన బ్రహ్మలు

చావుకే సవాలు విసిరిన చిరంజీవులు వృద్ధులు


కామెంట్‌లు