సర్వంసంక్షోభం; - డా.భరద్వాజ రావినూతల;-- కొత్తపట్నం-9866203795

 మట్టినవ్వితే పరమాణ్ణం.
నీరునవ్వితేచైతన్యం..
నింగినవ్వితేతొలకరి
నిప్పునవ్వితే వెలుతురు
గాలినవ్వితే ఊపిరి.
.కాని..
పంచభూతాలను తనలో నింపుకున్న మనిషి నవ్వితే కాలుష్యం వైషమ్యం...
అహింసరాజుగారిసమాధిలో
ఎకె47 నీడలో 
శాంతికపోతాలు నిద్దరపోతుంటే.
తెల్లచొక్కాలు వేసుకున్న డాక్టర్లలా రాజకీయం పోస్టుమార్టం చేస్తుంటే.
ఎన్ని పధకాలు తెచ్చినా
బీదవాడు బిలో పావర్టీ లైను దాటని పేదోడి బ్రతుకు
ప్లాట్ ఫారమ్ లపైనే పవళిస్తుంటే..
సంక్షేమం రెండురూపాయల బియ్యంతో మొదలై..
అంతకంతకు వామనుడిలా పెరిగి
సంక్షేమం సంక్షోభం గా మారితే.
దాన్ని పెంచిపోషిస్తున్నరాజకీయ జంబూకాలు..
అధికారం నిలుపుకోవడం కోసం
సిగ్గుబిడియాలు కండవాచాటున దాచుకుని పార్టీలు మారే నాయకుల భరించే దౌర్భగ్యం మనది.
పొత్తులకోసం
కడుపులో కత్తులు పెట్టుకు తిరిగే 
నాయకత్వానికి చేస్తున్నాం సలాం...
వయసుడిగినా ..కాళ్ళు చేతులు పడిపోయినా చచ్చినా వారసత్వం కావాలనుకునే అధికార ప్రియులకు చేస్తున్నాం గులాం..
కులం మతం ప్రాంతీయతత్వాలతో 
బిడ్డలుండీ గొడ్రాలుగా భరతమాతను మారుస్తున్న వారిని
నోటుకు ఓటుకు దిగజారి తెచ్చుకుంటున్నాం తలపైకి.
మనల్నిమనమే నెట్టుకుంటున్నాం
బాధల్లోకి
🪸💦🪸💦🪸💦🪸💦💦🪸

కామెంట్‌లు