మా మంచి తాతయ్య:- -గద్వాల సోమన్న,9966414580
తాతయ్య పిలుపులో
తన్మయత్వమున్నది
వారు చెప్పు కథలలో
నీతి ఎంతో ఉన్నది

తాతయ్య మనసులో
ప్రేమ ఊట ఉన్నది
వారి అనుభవంలో
ఆకాశమే చిన్నది

తాతయ్య మీసంలో
పౌరుషమే ఉన్నది
మెలివేస్తే మాత్రం
అండమెంతో ఉన్నది

తాతయ్య చేతిలో
చేతి కర్ర ఉన్నది
నడుచునప్పుడెల్లా
తోడు వేళ్ళు చున్నది

తాతయ్య కళ్ళలో
కళ చాలా ఉన్నది
వారి నోటి మాటలో
తేనె ధార ఉన్నది

మనుమళ్లను చూస్తే
తాతయ్యకు సంతసము
వారికది మరుపురాని
అనుభూతికి చిహ్నము

తాతయ్య ఉన్న ఇల్లు
అందమైన హరివిల్లు
అనురాగాల పొదరిల్లు
పరిమళాల విరిజల్లు

తాతయ్య మా కొండ
కోట రీతిలో అండ
అందుకే తాతయ్యకు
అక్షరాల పూదండ


కామెంట్‌లు