పరిశుభ్రత :- ఐలేని గిరి

 పల్లవి:
పరిసరాలు శుభ్రంగా ఉంచండి
స్వచ్చమైన గాలిని పంచండీ 
గాలికొరకు విరివిగా చెట్లను పెంచండి - పరిసరాలు
చరణం1:
కాగితాల ముక్కలు అరటి తొక్కలు
మిగిలిన ఆహారం మిగతా వ్యర్థం
ఎటుపడితే అటూ వేయకండీ 2
చెత్త బుట్ట వాడండీ 
అడుగడుగున పరిశుభ్రత అదే మనకు భద్రత - పరి//
చరణం2:
దగ్గినపుడు నోటినీ తుమ్మినపుడు ముక్కుని
గుప్పిటితో మూయడం మరవవద్దూ
పొగతాగి విషం చిమ్మవద్దూ 2
దాటకండి హద్దూ
అడుగడుగున పరిశుభ్రత అదే మనకు భద్రత - పరి//
చరణం3:
చెడుమాటలు చెప్పి మనసు చెదరనీయకండీ
మంచిని చేసే వారిని మన్నన చేయండీ 
చిరునవ్వుల పలకరింపు 2
ఆరోగ్యం నింపు
ఈ దేశం ఈ ధరిత్రి ఈ విశ్వం మనదే - పరి//
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
ఐలేని గిరి “పరిశుభ్రత” పై రాసిన పాట చాలా అద్భుతంగా ఉంది.
పిల్లలకూ, పెద్దలకూ అందరికీ ఉపయోగకరముగా ఉంటుంది