కాశీ వెళ్లగానే ముందు గా కాలభైరవుని దర్శించుకోవాలిశివుడు ఆయన్ని సృష్టించాడు.బ్రహ్మ కిఒకసారి గర్వంకల్గి"నాకు కూడా శివుడిలాగా5తలకాయలున్నాయి" అనుకోవటం ఆలస్యం కాలభైరవుడు తనబొటనవేలితోబ్రహ్మ ఐదోతలని తుంచేశాడు.అంతే పార్వతీ దేవి అమ్మ నాల్గు చేతులకింద తన నాల్గుతలలు పెట్టి శరణువేడాడు అని ఆదిశంకరాచార్యుల స్తుతించారు. వారాహిదేవి చీకటి పడగానే కాశీనగరసంచారంచేసి తెల్లారగానే గుడికి చేరుతుంది. ఆమె ని సరాసరి చూడలేము.అంత శక్తి స్వరూపం కాబట్టి కన్నంలోంచే చూడాలి. కాశీ లో సూర్య శక్తి ఉన్న కేంద్రం లోలార్కుడు.తులసీఘాట్ ఎదురుగా గోడపై చక్రం లో ద్వాదశాదిత్యుల శక్తి ఉంది. ఆరోగ్యం కలుగుతుంది. డుంఠిగణపతి తొండం ఎడమవైపుకు తిరిగుంటుంది.కావ్యకంఠగణపతి తండ్రి ఇక్కడే గణపతి మంత్రోపాసన చేయడం విగ్రహం లోని పిల్లాడు తన ఒళ్ళో కిపాకటం ఆయన కి కల్గిన అనుభూతి. అందుకే తనకి వెంటనే కొడుకు పుట్టాడు అన్న కబురు తెలియగానే గణపతి అనిపేరుపెట్టాడు తండ్రి. కావ్యకంఠగణపతి గా ప్రసిద్ధి చెందిన ఆయనకు నవరాత్రుల్లో కూచోబెట్టి పూజలుచేసేవారు.గణపతి పూజతర్వాత మంత్రపుష్పంతో పాటు ఉద్వాసన చెప్పటం ఆయన నవ్వుతూ శరీరత్యాగం చేయడం నమ్మలేని నిజం.
కాశీకి రెండోక్షేత్రపాలకుడు దండపాణి.హరికేశుడు అనేయక్షుడు చేతిలో వెండి బెత్తంతో ఉంటాడు.ఇకముక్తిమంటపంలో తప్పక శివ కథ ఒకటైనా చెప్పి రావాలి వినాలి.అక్కడ 4కోళ్లు ప్రాణంవదలటంతో కుక్కుటమంటపం అని కూడా అంటారు. శ్రీచక్రేశ్వరుడు అంటే శివలింగం పైశ్రీచక్రం ఉంది. భాస్కరాచార్యుడనే భక్తుడు 64 కోట్ల దేవతలపేర్లు గడగడచెప్పిన పుణ్యమూర్తి.
ఇక కాశీ వెళ్లలేని వారు కనీసం శ్రీశైలం కాళహస్తి పట్టిసం వెళ్లినా శివానుగ్రహం కలుగుతుంది .
కొసమెరుపు..హనుమ గణపతి చెక్కిళ్లకి సింధూరం పూయాలి.వినాయకవిగ్రహంపాదాలవద్ద గరికె పెట్టాలి.తమిళనాడు లో చాలా నిష్ఠగా ఇలా చేస్తారు 🌷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి