కలుగులోనుంచి బయటకు వచ్చినప్పుడల్లా ఎలుకకు చెట్టుమీద గంతులేస్తున్న ఉడుత కన్పిస్తూవుంటుంది ఉడుత కన్పిస్తే ఎలుకకు భలే ముచ్చటేస్తూవుంటుంది.ఎందుకంటే దాని వీపు మీద వున్న మూడుచారలు చూడ ముచ్చటగావుంటాయి.తనకూ అలాంటి చారలు లేవే అని ఎలుకకు దిగులు.ఆ మాటే తల్లితో అంటే,"అవి పుట్టుకతో వచ్చేవి.మనకు కోరపళ్ళు వున్నాయి.వాటితో మనం ఏదైనా కొరకగలం.అవి ఉడుతకు లేవుగదా.ఒక్కో జీవికి ఒక్కో ప్రత్యేకత సహజంగానే వస్తుంది.దాన్ని గురించి అట్టే ఆలోచించకు బుర్ర చెడుతుంది."అన్నది.అప్పటికి ఎలుక మౌనం గావుంది కానీ ఆ విషయం ఆలోచించడం మానలేదు.ఆలోచించగా ఆలోచించగా దానికో ఉపాయం తట్టింది. అతి కష్టంమీద ఒక చిన్న రంగు డబ్బా సంపాదించింది.దానితో ఒంటిమీద అందంగా మూడు తెల్లటి చారలు దిద్దుకుంది.మురిసిపోయింది.చెట్టుమీద గెంతుతున్న ఉడతను పలకరించింది."చూడు నేనూ నీలాగే అందంగా వున్నాను"అంది."నువు ఎవరో నాకు తెలియదు"అంటూ ఉడుత ముక్త సరిగా జవాబిచ్చింది.ఎప్పుడూ ఆప్యాయంగా మాట్లాడే ఉడుత ఇలా అనేసరికి ఎలుకకు బాధ కలిగింది.తనతోటి ఎలుకలతో ఆడదామనుకుంది.అవీతెలియనట్టు చూశాయి."నువు మా ఎలుకవు కావు.వింతగా వున్నావు.మా దగ్గరికి రాకు.నీతో మేం ఆడం" అన్నాయి "అప్పుడు గానీ అర్థంకాలేదుఎలుకకు తల్లిమాటలు.'మనం మనంలాగేవుండాలి. ఇంకోలాగ వుండడానికి ప్రయత్నించకూడ దు.పెట్టుడు నామాలున్న తనను ఉడుతా మిత్రుడిగా అంగీకరించలేదు.సహజత్వం కోల్పోడం వల్ల తన నేస్తాలయిన ఎలుకలూ తనతో ఆడడానికి అంగీకరించలేదు.అనుకుంటూ చిన్న నీటిగుంటలో మునిగి ఆ రంగు నామాలు పోగొట్టుకుందిఆ తరవాత సహజంగా బతకడానికి అలవాటు పడింది.
తల్లి చెప్పిందేనిజమైంది. :- .డా.గంగిశెట్టి శివకుమార్.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి