ఓ కెశివారెడ్డి కవివరేణ్యా!:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
సాహితీ జగతిలో
సవ్వడీ చేసేవు
సరస్వతీ దేవినీ
సన్నుతీ చేసేవు             ||సాహితీ||

అక్షరాలను పేర్చి
ఆటలూ ఆడించేవు
పదాలను కూర్చి
పాటలూ పాడించేవు

మదులనూ తట్టేవు
హృదులలో నిలిచేవు
భావాలు చెప్పేవు
భ్రమల్లో ముంచేవు           ||సాహితీ||

కలమును పట్టేవు
పుటలను నింపేవు
కైతలను కూర్చేవు
కమ్మదనమునిచ్చేవు

వైవిద్య విషయాలు
వివరంగ చెప్పేవు
నూతన ఒరవడులు
నిత్యమూ చూపేవు           ||సాహితీ||

కవన సేద్యమూ
కొనసాగించేవు
కవితల పంటలూ
కుమ్మరించేవు

రవివోలె కాంతులు
ప్రసరణాచేసేవు
శశివోలె వెన్నెలను
పుడమిపైచల్లేవు              ||సాహితీ||           

కయితా సుమాలను
పూయించేవు
కవన సౌరభాలను
వెదజల్లేవు

అమృతాజల్లులును
కురిపించేవు
అధరాలకు
తేనెచుక్కలనందించేవు          ||సాహితీ||

గాంధర్వగానమును
వినిపించేవు
కర్ణాలకింపుసొంపులను
కలిగించేవు

తెలుగుతల్లికీ
వందనాలు చేసేవు
తెలుగుజాతికీ
పేరుప్రఖ్యాతులు తెచ్చేవు        ||సాహితీ||

======================================

(కళా మిత్రమండలి ఒంగోలు వారు రేపు 24-11-2024వ తేదీ గౌరవనీయులు, ప్రముఖ కవి ,,సాహితీ వేత్త శ్రీ కె. శివారెడ్డి గారికి జీవన సాఫల్య పురస్కారం అందించే సందర్భముగా నేను వ్రాసిన పాట)


కామెంట్‌లు