శివానందలహరి:- కొప్పరపు తాయారు

 శ్లో: రోథస్తోయహృతః‌శ్రమేణ పథికశ్ఛాయాం తరోర్దృష్టి తో
భీతః స్వస్థగృహం గృహస్థమతిథి ర్దీనః ప్రభుం.ధార్మికమ్ 
దీపం సం తమసాకులశ్చ శిఖినం     
 శీతావృతస్త్వం  తథా
 చేతస్సర్వభయాపహం వ్రజ సుఖం
 శంభోః పదాంభోరుహం !!!

భావం:ఓ మనసా! నీళ్ళల్లో కొట్టుకొను పోవు వాడు తీరమును, బాటసారి అలసిపోయి చెట్టు
నీడను,వర్షము వలన భయపడు వాడు మంచి ఇంటిని,అదితి గృహస్థుని ఇంటి వలే, బీదవాడు 
దానికి ప్రభువువలే.చీకటిలో ఉన్నవాడు దీపము
వలె,చలిపుట్టినవాడు అగ్నిని ఆశ్వయించుట
వలె, నీవు సమస్త భయములు పోగొట్టి, సుఖములు కలుగజేయు ఈశ్వరుని పాదపద్మములు ఆశ్రయీంపుము.
            *****

కామెంట్‌లు