సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్టుమెంటు కమిటీలో డా.కుప్పిలి కీర్తి పట్నాయక్ కు సభ్యత్వం లభించింది. మహిళా సాధికారతలో భాగంగా గృహ హింస నిర్మూలన, బాలికా సంరక్షణ సాధించే దిశగా నిర్దేశించిన ఈ కమిటీలో విశాఖపట్నానికి చెందిన శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డా. కుప్పిలి కీర్తి పట్నాయక్ ను సభ్యురాలిగా ఎంపిక చేస్తూ, సి.పి.డబ్ల్యు.సి. కార్యపాలక్ అభియంతా ఆర్యా శ్రీనివాస నాయక్ సమాచారం పంపారు. గత రెండు దశాబ్దాలనుండీ సామాజిక బాధ్యతను గుర్తెరిగి, చిత్తశుద్ధితో శ్రమిస్తున్న కీర్తిని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు విశాఖపట్నం మాధవధార కేంద్రంగా పనిచేస్తున్న ఈ శాఖలో కీర్తి సేవలను గుర్తిస్తూ స్థానం కల్పించారు. నలుగురి సభ్యులతో కూడిన ఈ కమిటీకి ఛైర్మన్ గా టి.వెంకట దివ్యజ్యోతి, సభ్యులుగా ఎల్.నీరజ, ప్రియాంక దబ్బాడ, ఎన్.జి.ఓ.మెంబర్ గా కీర్తి పట్నాయక్ లను ఎంపిక చేసి వర్తమానం పంపారు. మూడేళ్ళ పాటు ఈ కమిటీ పనిచేస్తుందని ఆ వర్తమానంలో పేర్కొన్నారు. కీర్తి పట్నాయక్ ఎంపిక పట్ల పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేసారు.
సి.పి.డెబ్ల్యు.డిపార్టుమెంట్ కమిటీ సభ్యులుగా కీర్తి పట్నాయక్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి