మనకొచ్చిన కష్టానికి
మనసు ధైర్యం ఇస్తుంది
మనను ముందుకు నడిపించి
మనతోనే ఉంటానంటుంది
లేని తెగువను తెచ్చి
లేచి పరిగెత్తమంటుంది
లేవకపోతే మనలేవని
లేపి ముందుకు తోస్తుంది
పరుగాపి బేలగ చూస్తే
పర్లేదు చేయగలవని
ప్రోత్సహించి కొత్తగా
ప్రచోదనం చేస్తుంది
అసహనంగా అనిపిస్తే
అభిమానంగా తట్టి
ఆవేశం అసలొద్దు
అన్నీ సర్దుకునేస్తాయంటుంది
అలసిపోయానంటే
అలా ఆగితే ఎలా
ఆగి సాగిపోవాలని
ఆరడి పెట్టేస్తుంది
అడుగడుగునా తోడుండే
ఆత్మ బంధువై చేయివదలని
అంతరంగం అలసిపోతే
ఆదరించిదేవరు ఓదార్చేదెవరు?
రేపన్నది రేపే ఆశల అరుణోదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి