పిల్లలు!!!;-సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ బిజినేపల్లి మండలం నాగర్ కర్నూల్ జిల్లా
కొండల్లాంటీ
రాతి గుండెలను 
కరిగించే వాళ్లు 
పిల్లలు!!!

మంచు కొండల్లాంటీ
చల్లని గుండెలు కలవారు 
చిన్నపిల్లలు!!

ఎవరెస్ట్ అంతా ఎతైన
వాళ్లనైనా కిందికి దించే 
వాళ్లు 
పసిపిల్లలు!!!

మాయ లాంటి 
ఎండమావులను కూడా 
పరిగెత్తించే 
అమాయకులు-పిల్లలు!!

చిరునవ్వులతో 
వెలిగే 
చిరు దివ్వెలు-పిల్లలు!!!
దీపావళి పిల్లలు!!!


కామెంట్‌లు