శ్లో:! కర లగ్న మృగః కీరంద్ర భంగో
ఘన శార్దూల విఖండనో స్తజంతుః.
గిరిశో విశదాకృతిశ్చ చేతః
కుహరే పంచముఖోస్తి మే కుతో భీరి!!
భావం: మృగమును చేతిలో
ధరించిన వాడునూ,
గజాసురుని సంహరించినవాడునూ, వ్యాఘ్రాసురుని ఖండించిన వాడునూ, జంతువులు అన్నియూ లయము చెందిన వాడునూ, కొండలో నివసించువాడునూ, తెల్లని శరీరము కలవాడునూ, పంచముఖుడు అయిన
శివుడు, నా హృదయమందే నివసించుచున్నాడు.
ఇక నాకు భయము ఎక్కడిది ?
******
శివానందలహరి:- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి