ఓం నమశ్శివాయ....!!:- కోరాడ నరసింహా రావు
ఓం నమశ్శివాయ....!! 
        ఓం నమశ్శివాయ....!! 
             ఓం నమశ్శివాయ....!! 
అమ్మ ఆగ్రహమునకు, మున్ను    బుట్టిన  హరియుబ్రహ్మయు బూడిదై పోగా...,
   ఆ యాది శక్తిని ఒప్పించి , మె ప్పించి...మూడవ నేత్రమును కైవశము జేసికొని , ఆగ్రహోదగ్ర యవ్ ఆ యమ్మనే భ స్మ ము జేసిన ఆది శంకరుడవీవు...!

అమ్మ భస్మ మునే మూడు భాగములు జేయ... మీ త్రి మూ ర్తు లు నూ...ఆ మువ్వు రనూ పరిణయమ్మాడి, 
  శ్రుష్ఠి ,స్థితులను సోదరులిరు వురకు నొసగి ...నీవు లయకారుడ వై నావు...! 

 ఓ నిరంతర తపోధనా... 
   ఓ యోగీశ్వరా... 
  ఓ సంగీత , నాట్య విశారదా
   ఓ భక్త సులభా... ఓ బోళ  శంకరా...! 
     పాల సముద్ర మును మధి ఇంచు నపుడు అమ్రుతము కన్న మున్ను, విషముద్భ వించగా... ఆ కాల కూటమును  గొ0తుననుంచి.. 
 గరళ కంఠుడ వైనావు..! 

 భగీరధుని కొరకు గంగాధరుడ వై ... భువిని పావన మొనర్చినావు...! 

ఓ లింగ రూపా...
     ఓ త్రిశూలపా ని.... 
       ఓ  అభిషేక ప్రియా... 
         ఓ నంది వాహానా... 
               నాగ భూ ష ణ ! 
      ఓ గిరిజా రమణ... 
         అర్ధ నా రీ శ్వ రా.... 
  ఆదుకొనవయ్యా....!! 

వింత - వింత రోగముల నుండి 
   ప్రకృతి వైపరీత్యములనుండి
     కాపాడ వయ్య...కరుణామ యా...! 
   సాలీడుకీ , సర్పమునకు... 
ఏనుగునకునూ మొక్ష మొ సగిన దయా మయా... 

మము కృప గన లేవా...!! 
   హర హర శంభో సదా శివా... 
 శివ శివ శంభో మహేశ్వరా.... 
  ఓం నమశ్శివాయ....! 
     ఓం నమశ్శివాయ....!! 
        ఓం నమశ్శివాయ....!!! 
           ******
కామెంట్‌లు