ఓర్వలేనితనం :- -గద్వాల సోమన్న,-9966414580
ఓర్వలేనితనము చెరుపు
బాధ పెట్టుచుండు కురుపు
అధికం కాకముందే
వదిలిపెడితే మంచిదే!

ఒళ్ళంతా వ్యాపించే
భయంకరమైన రోగము
బ్రతుకంతా పీడించే
 పాడు చేయు పెను భూతము

ఓర్వలేనితనముంటే
సంతోషమే ఉండదు
జబ్బులకదే కారణము
ప్రగతి ఏమాత్రము జరగదు

తొలి నాడే వీడితే
బాగు పడును జీవితాలు
పువ్వుల్లా వికసించును
దివ్వెల్లా ప్రకాశించును


కామెంట్‌లు