సూక్తుల సమాహారము:- -గద్వాల సోమన్న,-9966414580
వీడితే సంశయాలు
బాగుపడును కుటుంబాలు
చూపితే అనురాగాలు
గట్టిపడును బంధాలు

గౌరవిస్తే నమ్మకాలు
వృద్ధియగును గౌరవము
ఉట్టిపడును సంస్కారము
బలపడును సామరస్యము

సాధిస్తే విశ్వశాంతి
బ్రతుకుల్లో సంక్రాంతి
జగమంతా సంబరాలు
విరజిమ్మును నవకాంతి

మహాత్ముల సహవాసము
జీవితాన మధుమాసము
అగును భావి జీవితము
పరిమళించు పూలవనము


కామెంట్‌లు