సాహితీ సవ్వడులు:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
సాహితీచైతన్యం 
స్వాగతిస్తుంది
సాహితీలోకం
సంభాలిస్తుంది

సాహితీసాగరం
దిగమంటుంది
సాహితీప్రస్థానం
సాగించమంటుంది

సాహితీసేవలు 
చేయమంటుంది
సాహితీకిరణాలు
ప్రసరించమంటుంది

సాహితీనౌక
ఎక్కిపయనించమంటుంది
సాహితీసమరం
కొనసాగించమంటుంది

సాహితీవనం
విహరించమంటుంది
సాహితీవలయం
చేబట్టుకుంటుంది

సాహితీసాహచర్యం
వీడొద్దంటుంది
సాహితీసౌరభం
వెదజల్లమంటుంది

సాహితీసమ్మేళనాలు
సందడిచేస్తున్నాయి
సాహితీసంబరాలు
ఆహ్వానంపలుకుతున్నాయి

సాహితీస్ఫూర్తి
ప్రదర్శించమంటుంది
సాహితీశక్టి
చూపించమంటుంది

సాహితీపధం
నడకసాగించమంటుంది
సాహితీగమ్యం
చేరుకోమంటుంది

సాహితీసామ్రాజ్యం
స్థాపించాలనున్నది
సాహితీమహారాజ్యం
పాలించాలనున్నది
 


కామెంట్‌లు